ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ. ఏటీఎం కేంద్రాలు బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. ముఖ్యంగా నగదు విత్‌డ్రా సేవలన్నీ ఏటీఎంల ద్వారా పొందే స్థాయికు వచ్చాయి. అయితే ఈ ఏటీఎం కేంద్రాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో వారు ఏటీఎం సేవలను పొందాలంటే సమీప పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని బ్యాంకుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏటీఎం సేవలను అందించినా పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ఆ సేవలను అందరికీ అందడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఆన్‌లైన్ ఆధార్ ఏటీఎం సేవలను వినియోగదారులకు అందిస్తుంది. ఈ సేవలతో బ్యాంక్ లేదా ఏటీఎంకి వెళ్లకుండానే మీ నగదు అవసరాలను మీ ఇంటి వద్దే తీర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇండియా పోస్ట్స్ అందించే సేవల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
అత్యవసర నగదు అవసరం అయితే బ్యాంకును సందర్శించడానికి సమయం లేదా? ఆధార్ ఏటీెం సేవతో మీ ఇంటి సౌకర్యం నుంచి నగదును విత్‌డ్రా చేసుకోండని ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ (ఐపీపీబీ) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాసింది. ఈ నేపథ్యంలో ఏఈపీఎస్ మీ బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడానికి మీ ఆధార్‌ను మీ గుర్తింపుగా ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు మీ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడం, నగదు ఉపసంహరించుకోవడం లేదా బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా డబ్బు పంపడం వంటి ప్రాథమిక బ్యాంకింగ్ పనులను చేయవచ్చు. ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 10,000 అనుమతించబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి