AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Scooters: ఏథర్ ఈవీ స్కూటర్ కొనుగోలుకు పెరుగుతున్న ఆసక్తి.. ఐదు ప్రధాన కారణాలివే..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రజలను ఇటీవల ఏథర్ రిజ్టా ఈవీ స్కూటర్ అమితంగా ఆకర్షిస్తుంది. ఇటీవల ప్రచురించిన ఫలితాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మొత్తం అమ్మకాలు 1 లక్ష యూనిట్లను దాటాయంటే ఈ స్కూటర్‌ను ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

EV Scooters: ఏథర్ ఈవీ స్కూటర్ కొనుగోలుకు పెరుగుతున్న ఆసక్తి.. ఐదు ప్రధాన కారణాలివే..!
Ather
Nikhil
|

Updated on: Jun 07, 2025 | 5:30 PM

Share

ఏథర్ రిజ్టా ఈవీ స్కూటర్ ప్రీమియం లుక్‌తో వినియోగదారులకు ఆకర్షిస్తుంది. స్పోర్టినెస్‌తో పాటు ప్రీమియం అప్పీల్ వైపు మొగ్గు చూపే కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఈ స్కూటర్‌ను రూపొందించారు. ముఖ్యంగా కుటుంబంలోని అందరికీ నచ్చేలా ఈ ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేశారు. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో పాటు ఆకట్టుకునే పనితీరు, పర్యావరణ పరిరక్షణ కోసం ఆలోచించే వారు రిజ్జా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. బడ్జెట్-కేంద్రీకృత స్కూటర్లను కొనుగోలు చేసే వారు అధికమవుతున్న ప్రస్తుత తరుణంంలో ఏథర్ రిజ్టాను కొనుగోలు చేసే వారి సంఖ్య గమనార్హం. ఈ నేపథ్యంలో ఏథర్ రిజ్టా ఈవీను కొనుగోలుకు వినియోగదారులను ఆకర్షిస్తున్న ఐదు ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం. 

డిజైన్

ఏథర్ రిజ్జా స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. సౌకర్యంతో యాక్సెసిబిలిటీకి ప్రాధాన్యతనిచ్చేలా అందరినీ ఆకర్షిస్తుంది. ఈ స్కూటర్‌పై ఇద్దరు వ్యక్తుల సౌకర్యంగా కూర్చొవచ్చు. ముఖ్యంగా ఏథర్ రిజ్టా జెడ్ వేరియంట్ 119 కిలోల కెర్బ్ బరువు ఉన్న కారణంగా ట్రాఫిక్‌లలో తేలికగా నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు. డిజైన్‌లో ఫ్లాట్ ఫుట్బోర్డ్, దృఢమైన గ్రాబ్ రైల్స్, విశాలమైన బాడీ ప్యానెల్స్ ఆకట్టుకుంటాయి. 

నిల్వ

రిజ్జా నిల్వ స్థలం సగటు మధ్య తరగతి కుటుంబాన్ని ఆకర్షిస్తుంది. ఈ స్కూటర్ 34 లీటర్ల అండర్-సీట్ కంపార్ట్మెంట్‌ను అందిస్తుంది. ఫఉల్ ఫేస్ హెల్మెట్‌తో పాటు షాపింగ్ బ్యాగులను నిల్వ చేయడానికి తగినంత పెద్దదిగా ఉంటుంది. అలాగే 22 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ ఆకట్టుకుంటుంది. ఫోన్ హెూల్డర్, యూఎస్’బీ ఛార్జింగ్ పోర్ట్, బ్యాగ్ల కోసం హుక్స్ వంటివి అచాచ్ చేసుకుంటే రోజువారీ సౌలభ్యాన్ని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

పనితీరు, పరిధి

ఏథర్ రిజ్టా నగర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. జెడ్ వేరియంట్లు 4.3 కేడబ్ల్యూ పీక్ పవర్ అవుట్ పుట్‌తో వస్తాయి. అయితే ఎస్ వేరియంట్ 3.5 కేడబ్ల్యూ మోటారునుతో వస్తుంది. ఈ స్కూటర్ జిప్ మోడ్‌లో 0-40 కిమీ/గం మైలేజ్ ఇస్తుంది. యాక్సిలరేషన్ సమయం 4 సెకన్లలోపు ఉంటుంది. అలాగే 80 కిమీ/గం గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. అందువల్ల ఈ స్కూటర్ రోజువారీ ట్రాఫిక్ కు సరిపోతుంది. ఈ స్కూటర్‌లో రెండు బ్యాటరీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 123 కిమీ ఐడీసీ పరిధిని అందించే 2.9 కేడబ్ల్యూహెచ్ ప్యాక్, 160 కిమీ క్లెయిమ్‌డ్ పరిధితో 3.7 కేడబ్ల్యూహెచ్ యూనిట్ రెండోది. రిజ్టా డ్యూయల్ రైడ్ మోడ్లను కూడా అందిస్తుంది. 

లెటెస్ట్ ఫీచర్స్ 

ఏథర్ రిజ్టా లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆకట్టుకుంటుంది. జెడ్ వేరియంట్లలో 7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్ ఉంటుంది, ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మ్యూజిక్ కంట్రోల్స్, లైవ్ రైడ్ గణాంకాలు, థెఫ్ట్/టో అలెర్ట్స్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్లు ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్ కు మద్దతు ఇస్తాయి. రిజ్జా ఎస్ వేరియంట్ 5-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. అలాగే రోజువారీ దృఢత్వం కోసం ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. కలిగి ఉంటుంది. 

ఛార్జింగ్ నెట్వర్క్

రిజ్జా ఆకర్షణలో ఏథర్ విశ్వసనీయత ముఖ్య పాత్ర పోషిస్తుంది. భారతదేశంలోని అత్యంత విస్తృతమైన ఈవీ ఛార్జింగ్ నెట్ వర్క్లలో ఒకటైన ఏథర్ గ్రిడ్ యాక్సెస్ నుంచి కొనుగోలుదారులు మంచి ప్రయోజనం పొందుతారు. ప్రధాన నగరాల్లో వ్యూహాత్మకంగా ఫాస్ట్ ఛార్జర్లను ఉంచారు. రిజా టైప్-2 ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 3.7 కేడబ్ల్యూహెచ్ ప్యాక్‌తో దాదాపు 4 గంటల 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్‌ను పూర్తి చేయవచ్చు. ఏథర్ స్కూటర్కు 5 సంవత్సరాల/60,000 కి.మీ బ్యాటరీ వారంటీ, వాహనంపై 3 సంవత్సరాల వారంటీతో మద్దతు ఇస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి