ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. భారతదేశంలో అయితే గతంలో పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈవీ వాహనాలు ప్రస్తుతం సాధారణ గ్రామస్థాయి ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాంగా సగటు సామాన్యుడు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభుత్వాలు కూడా పెరుగుతన్న కాలుష్యాన్ని అరికట్టడానికి ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తున్నాయి. దీంతో చైనా, అమెరికా తర్వాత ఈవీ వాహనాల కొనుగోలులో తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. అనూహ్యంగా ఈవీ వాహనాలకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో చాలా కంపెనీలు కొత్తకొత్త మోడల్స్ ఈవీలను మార్కెట్‌లో రిలీజ్ చేశాయి. ఇప్పుడు పెరుగుతున్న పోటీలో తమను తాము నిరూపించుకోవడానికి కంపెనీలు వివిధ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజా ఏథర్ ఎనర్జీ సంస్థ తన ఈవీ వాహనాలపై భారీ తగ్గింపులను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏథర్ ఏయే స్కూటర్లపై ఆఫర్లను ప్రకటిస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ దాని ప్రసిద్ధ ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన 450 ఎస్ ధరల్లో గణనీయమైన తగ్గింపును ప్రారంభించింది. ఈ స్కూటర్‌పై ఏకంగా రూ. 25,000 వరకు తగ్గింపు ప్రకటించిన వ్యూహాత్మక చర్యలో భాగంగా ఏథర్ 450 ఎస్‌కు సంబంధించిన బేస్ వేరియంట్ ఇప్పుడు రూ. 1.09 లక్షల (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)కు లభిస్తుంది. అయితే మరింత మెరుగుపరచబడిన ప్రో ప్యాక్ వేరియంట్ ఇప్పుడు రూ. 1.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకించి ఏథర్ బేస్ వేరియంట్‌పై కూడా రూ.20,000 తగ్గింపును అందిస్తుంది. అయితే ప్రో ప్యాక్ వేరియంట్‌పై కూడా రూ. 25 వేల తగ్గింపును అందిస్తున్నారు.
ఏథర్ 450 ఎస్ ఒక ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా 115 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌తో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఫాల్‌సేఫ్, పార్క్‌అసిస్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ఈఎస్‌ఎస్), కోస్టింగ్ రీజెన్‌లతో సహా అధునాతన ఫీచర్‌లు ఈ స్కూటర్ సొంతం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..