Assaulted in Metaverse: మెటావర్స్‌లో చేరిన 60 సెకన్లలోపే గ్యాంగ్‌రేప్..! మహిళ సంచలన ఆరోపణలు..

|

Feb 02, 2022 | 4:17 PM

మెటావర్స్‌లో చేరిన 60 సెకన్లలోపే గ్యాంగ్‌రేప్ గురయ్యానని 43 ఏళ్ల నినా జేన్ పటేల్ ఆరోపించారు. గత ఏడాది చివర్లో..

Assaulted in Metaverse: మెటావర్స్‌లో చేరిన 60 సెకన్లలోపే గ్యాంగ్‌రేప్..! మహిళ సంచలన ఆరోపణలు..
meeaverse
Follow us on

మెటావర్స్‌లో చేరిన 60 సెకన్లలోపే గ్యాంగ్‌రేప్ గురయ్యానని 43 ఏళ్ల నినా జేన్ పటేల్ ఆరోపించారు. గత ఏడాది చివర్లో మెటా రూపొందించిన VR ప్లాట్‌ఫారమ్ హారిజన్ వరల్డ్స్‌లో బీటా టెస్టర్‌గా ఉన్నప్పుడు తన వర్చువల్ అవతార్‌కు ఏం జరిగిందో వివరించారు. నీనా జేన్ పటేల్ వెబ్ పోర్టల్ మీడియంలో తన అనుభవాన్ని పంచుకుది. ‘నన్ను మానసికంగా, లైంగికంగా వేధించారు. మగ స్వరాలతో మూడు నుంచి నాలుగు మగ అవతారాలు నా అవతార్‌పై సామూహిక అత్యాచారం చేసి ఫోటోలు తీశారు.’ అని వివరించారు.

‘భయంకరమైన అనుభవం చాలా వేగంగా జరిగింది. ఇది ఒక పీడకల’. అని చెప్పారు. వర్చువల్ ప్రపంచం ప్రస్తుతం బీటా పరీక్షలో ఉంది. ‘ ఇంట్లో కూర్చోని వినియోగదారులు కచేరీలు, క్రీడలు, కామెడీ వంటి ప్రత్యక్ష ప్రసార ఈవెంట్‌లను అనుభవించగలరని మెటా వాగ్దానం చేసింది. పరిశ్రమలు ఏకతాటిపైకి రావాలని, మెటావర్స్‌లో వేధింపులను ఎదుర్కోవటానికి భద్రతా నియంత్రణా చర్యలు తీసుకోవాలని పటేల్ కోరారు.

‘2D ఇంటర్నెట్ నుంచి 3D ఇంటర్నెట్ స్పేస్ (Metaverse)లోకి ప్రపంచ వేగంగా కదులుతున్నందున ఇది కొనసాగుతుందని ఆమె అన్నారు. ఆరోపణకు ప్రతిస్పందిన మెటా ప్రతినిధి.. ఈ సంఘటనకు పశ్చాత్తాపపడ్డారు. సాంకేతిక సంస్థ హారిజన్ వెన్యూస్‌లోని ప్రతి ఒక్కరూ సానుకూల అనుభవాన్ని పొందాలని, భద్రతా సాధనాలను త్వరగా యాక్సెస్ చేస్తామని వినియోగదారులకు భరోసా ఇచ్చారు.

హారిజన్ వెన్యూలను సురక్షితమైన ఆన్‌లైన్ స్థలంగా చేయడానికి కంపెనీ కట్టుబడి ఉందని, మెటావర్స్‌లో వారి పరస్పర చర్యల గురించి వినియోగదారుల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్రయత్నాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు. ఒక సంవత్సరం బీటా పరీక్ష తర్వాత, Meta డిసెంబర్ 9న యునైటెడ్ స్టేట్స్, కెనడాలో 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ హారిజన్ వరల్డ్స్‌ను విడుదల చేసింది.

Facebook కంపెనీకి చెందిన ‘metaverse’ సంస్కరణకు సైన్ ఇన్ చేసిన ఎవరైనా, వినియోగదారుల అవతార్‌లు కలుసుకునే,కమ్యూనికేట్ చేసే ఆన్‌లైన్ ప్రపంచం ఇది. అలాగే వేగంగా పెరుగుతున్న నగరాలు, దేశ దృశ్యాలు లేదా కేఫ్‌ల వంటి వర్చువల్ గమ్యస్థానాల నెట్‌వర్క్‌ను సందర్శించడం ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు.

Read Also.. New Asian Paints Ultima Protek: న్యూ ఏషియన్ పెయింట్స్ చమత్కారమైన వీడియో..