Market News: రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల(Ukraine Russia War) మధ్య ఆసియా మార్కెట్లు వారం ప్రారంభంలో ఒడిదుడుకుల్లో ట్రేడ్(Markets volatile) కానున్నాయి. ఈ కారణంగా ఏ క్షణంలోనైనా క్రూడ్ ఆయిల్ ధరలు(Crude oil prices) ఏడు సంవత్సరాల గరిష్ఠాన్ని తాకే అవకాశం ఉంది. రష్యా ఏ క్షణానైనా యుద్ధాన్ని ప్రారంభించే అవకాశం ఉందని.. నాటో భూభాగాన్ని తాము కాపాడతామని అమెరికా ప్రకటించింది. దీనికి తోడు పుతిన్, బైడెన్ మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం కాకపోవడం మార్కెట్లపై భారీ ప్రభావాన్ని చూపనున్నాయి. ఇప్పటికో జపాన్ మార్కెట్ సూచీ నిక్కీ 2.1 శాతం నష్టాలను రికార్డు చేసింది.
దీనికి తోడు మార్చిలో ఫెడరల్ రిజర్వ్ రేట్లను పూర్తిగా 50 బేసిస్ పాయింట్ల మేర పెంచవచ్చనే ఊహాగానాలకు దారితీసిన ఆందోళనకరమైన అమెరికన్ ద్రవ్యోల్బణంతో మార్కెట్లు స్తబ్ధుగా మారాయి. 5, 10 సంవత్సరాల బాండ్ ఈల్ట్ కర్వ్ ఇన్వర్ట్ కావడంతో అమెరికన్ ఫెడ్ చేపట్టనున్న చర్యలతో ఎకనమిక్ గ్రోత్ తగ్గుతుందని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ సైతం నేడు అపరిమిత బాండ్ కొనుగోలు ఆఫర్‌ను నిర్వహిస్తుంది. ఈ ప్రభావం యూరో, డాలర్ కరెన్సీ మారకం విలువపై భారీగా పడనుంది. ఈ ఆందోళనల నడుమ బంగారం ధర పెరుగుతోంది. పెట్టుబడిదారుల సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ గా బంగారాన్ని భావించడం వల్ల.. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గేంత వరకు బంగారం ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి..
LIC IPO: ఎల్‌ఐసీ కస్టమర్లకి గుడ్‌న్యూస్.. ఐపీఓ షేర్ల విషయంలో మరో కొత్త అప్‌డేట్..?
5G in India: త్వరలోనే భారత్ లో 5జీ సేవలు.. స్పెక్ట్రమ్ వేలం ఎప్పటినుంచంటే..