Post Office Franchise: కొందరికి ఉద్యోగం చేయడం పెద్దగా నచ్చదు. సొంతంగా ఏదో పని చేసుకోవాలని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి మొగ్గు చూపుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో వ్యాపారం అంటే రూ. లక్షలతో కూడుకున్న అంశంగా మారింది. కానీ తక్కువ పెట్టుబడితో అందులోనూ సొంతూరులో వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ! అందూలోనూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోస్టల్ వ్యవస్థతో అనుసందానమై ఉంటే మరీ మంచిది కదూ.. మీకు ఇప్పుడు ఇలాంటి ఓ అద్భుత ఫ్రాంజైజ్ గురించే చెప్పుకుందాం.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం1.55 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనూ సేవలందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ వ్యవస్థను విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఫ్రాంచైజ్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పోస్టల్ వ్యవస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మనీ ఆర్డర్లు, స్టాంపులు, స్టేషనరీ, లెటర్స్ పంపిణీ, బ్యాంకుల ఖాతాలు, చిన్న పొదుపు ఖాతాలను తెరవడం వంటిని అందుబాటులో ఉంచుతున్నారు.
పోస్ట్ ఆఫీజ్ ఫ్రాంచైజ్ పథకాన్ని 18 ఏళ్లు నిండి ఎనిమిద తరగతి పాసైన వారు ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో భాగంగా ఇండియన్ పోస్టల్ రెండు రకాల ఫ్రాంచైజీలను అందిస్తోంది. వీటిలో ఒకటి అవుట్‌లెట్ కాగా మరొకటి పోస్టల్ ఏజెంట్. సాధారణ పోస్టాఫీసుల్లో చేసే అన్ని పనులను అవుట్‌లెట్ ఫ్రాంచైజ్ నిర్వహిస్తుంది. ఉత్తరాల పంపిణీ సేవకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ ఫ్రాంచైజీ సేవలను ఇప్పటి వరకు లేని ప్రాంతంలో మాత్రమే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.
పోస్టల్ ఫ్రాంచైజీని తీసుకోవడానికి కేవలం రూ. 5000 సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఓపెన్ అవుట్‌లెట్ సేవలకు ఎలాంటి అదనపు పెట్టుబడి అవసరం ఉండదు. కానీ పోస్టల్ ఏజెంట్ కోసం మాత్రం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనికి కారణం వారు అదనంగా స్టేషనరీ సామానులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడానికి కనీసం 200 చదరపు అడుగుల కార్యాలయం ఉండాలి. అంతేకాకుండా ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలనుకునే వారి బంధువు ఎవరూ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగై ఉండకూడదు.
పోస్టల్ ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలని ఆసక్తి ఉన్న వారు https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf లో ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఆ దరఖాస్తు ఫామ్‌ను ఫిల్ చేసి స్థానిక పోస్టాఫీసులో సమర్పించాలి. ఇక ఈ ఫ్రాంచైజ్ ద్వారా వచ్చే ఆదాయం విషయానికొస్తే.. స్పీడ్ పోస్ట్‌కు రూ. 5, మనీ ఆర్డర్‌కు రూ. 3 నుంచి రూ. 5, పోస్టల్ స్టాంపులు, స్టేషనరీల అమ్మకాలపై 5 శాతం కమీషన్ లభిస్తుంది.
KTR son Himanshu: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన హిమాన్షు..