Fixed Deposit: మీరు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారా? ఇలా చేస్తే అధిక రాబడి పొందవచ్చు..!

|

Oct 12, 2021 | 9:02 AM

Fixed Deposit: బ్యాంకుల్లో డబ్బులను దాచుకోవడం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి..

Fixed Deposit: మీరు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారా? ఇలా చేస్తే అధిక రాబడి పొందవచ్చు..!
Follow us on

Fixed Deposit: బ్యాంకుల్లో డబ్బులను దాచుకోవడం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగింది. దీంతో డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేదు. కొన్ని చిట్కాల వల్ల అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అవేంటో చూద్దాం. ట్రిక్స్ వల్ల అధిక రాబడి సొంతం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

షార్ట్ టర్మ్ డిపాజిట్లను ఎంచుకోవాలి. అంటే తక్కువ కాల పరిమితితో బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్‌ చేసుకోవాలి. ఒకవేళ ఆర్‌బీఐ తర్వాతి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లు పెంచితే.. అప్పుడు ఇలా చేయడం వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేసి ఉంటే.. మెచ్యూరిటీ గడువు దగ్గరిలో ఉంటే.. మీరు ఆ డబ్బులు తీసుకొని ఒకే టెన్యూర్‌లో కాకుండా వివిధ కాల పరిమితుల్లో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. దీని వల్ల ప్రయోజనం పొందవచ్చు.

బ్యాంకులు ఇప్పుడు ఫ్లోటింగ్ రేటు ఎఫ్‌డీలను అందిస్తున్నాయి. వీటిల్లో డబ్బులు పెడితే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బెనిఫిట్ పొందవచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను కూడా ఒకేరకమైన బ్యాంకుల్లో కాకుండా వివిధ బ్యాంకుల్లో తెరవాలి. అంటే పెద్ద బ్యాంకుల్లో కొంత మొత్తం, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. బ్యాంకుల్లో కాకుండా ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేటు బాండ్లలో కూడా డబ్బులు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇందులో 7.15 శాతం వరకు బెనిఫిట్‌ పొందవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Contactless Payment: పండగ సీజన్‌లో కొనుగోళ్లు జోరు.. ఈ కార్డులపై అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..!

Provident Fund: గుడ్‌న్యూస్‌.. దీపావళి పండగకు ముందే పీఎఫ్‌ వడ్డీ.. ఏర్పాట్లు చేస్తోన్న ఈపీఎఫ్‌ఓ..!