AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: వచ్చే వారం బ్యాంకులకు రెండ్రోజుల పాటు సెలవులు.. ఏ రోజుల్లో మూసి ఉంటాయంటే?

బ్యాంక్ ఖాతాదారులకు ఇదో బిగ్ అలర్ట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చే వారం అనగా జూన్ 15 నుండి జూన్ 21 మధ్య దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు రెండు రోజుల పాటు మూతబడనున్నాయి. ఈ నెల మొత్తంలో 5 రోజుల పాటు బ్యాంక్‌లు క్లోజ్ అవ్వనున్నాయి. అసలు బ్యాంకులు ఎందుకు క్లోజ్ అవుతాయి. ఏ లేదీల్లో బ్యాంక్‌లకు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Bank Holidays: వచ్చే వారం బ్యాంకులకు రెండ్రోజుల పాటు సెలవులు.. ఏ రోజుల్లో మూసి ఉంటాయంటే?
Bank Holidays
Anand T
|

Updated on: Jun 14, 2026 | 2:12 PM

Share

బ్యాంక్ ఖాతాదారులకు ఇదో బిగ్‌ అలర్ట్.. ఎందుకంటే వచ్చే వారంలో రెండ్రోజుల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లు మూతబడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా ప్రకారం.. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన పండుగలతో పాటు రెండో శనివారం, నాల్గో శనివారం, అన్ని ఆదివారాలను కలుపుకుని ఈ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. కొన్ని సెలవులు కేవలం కొన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాలకే పరిమితం కాగా, జాతీయ సెలవు దినాల్లో మాత్రం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. SBI, HDFC వంటి బ్యాంకులకు వెళ్లే వినియోగదారులు ఆయా తేదీలను చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

జూన్ 2026 లో బ్యాంక్ సెలవుల పూర్తి వివరాలు ఇవే

  • జూన్ 15: యంగ్ మిజో అసోసియేషన్’ (YMA) స్థాపక దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్‌ లో.. అలాగే ‘రాజా సంక్రాంతి’ సందర్భంగా భువనేశ్వర్‌ లో బ్యాంకులు మూతబడనున్నాయి.
  • జూన్ 21: ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు క్లోజ్ అవుతాయి
  • జూన్ 25: మొహర్రం సందర్భంగా విజయవాడ లో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • జూన్ 26: మొహర్రం సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, కాన్పూర్, లక్నో, నాగ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్, భోపాల్, బేలాపూర్, అగర్తలా, ఐజ్వాల్, జమ్మూలలో బ్యాంకులు పనిచేయవు.
  • జూన్ 29: సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా షిమ్లాలో బ్యాంకులకు సెలవు ప్రకటించబడి.
  • జూన్ 30: ‘రెమ్నా ని’ అనే ప్రాంతీయ పండుగ సందర్భంగా ఐజ్వాల్‌ లో బ్యాంకులు మూసి ఉంటాయి.

బ్యాంకులు మూసి ఉన్నా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి సేవలు

ఇవి కూడా చదవండి

బ్యాంక్ బ్రాంచ్‌లు మూసి ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది. డబ్బులు పంపడానికి లేదా స్వీకరించడానికి గూగుల్‌ పే, ఫోన్ పే లేదా బ్యాంక్ మొబైల్ యాప్స్ 24 గంటలూ పనిచేస్తాయని పేర్కొంది. అలాగే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ATM కార్డ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. అకౌంట్ మెయింటెనెన్స్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ సెటప్ చేయడం, లాకర్ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us