LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన.. యాంకర్‌ బుక్‌లో 71% షేర్లు దేశీయ ఫండ్లకు కేటాయింపు..

| Edited By: Anil kumar poka

May 04, 2022 | 9:07 AM

ఎల్‌ఐసీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (LIC IPO)లో యాంకర్‌ ఇన్వెస్టర్ల విభాగానికి కేటాయించిన షేర్ల ద్వారా రూ.5,627 కోట్లు సమీకరించినట్లు కంపెనీ మంగళవారం తెలిపింది.

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన.. యాంకర్‌ బుక్‌లో 71% షేర్లు దేశీయ ఫండ్లకు కేటాయింపు..
Lic Ipo
Follow us on

ఎల్‌ఐసీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (LIC IPO)లో యాంకర్‌ ఇన్వెస్టర్ల విభాగానికి కేటాయించిన షేర్ల ద్వారా రూ.5,627 కోట్లు సమీకరించినట్లు కంపెనీ మంగళవారం తెలిపింది. ఈ విభాగానికి పూర్తి స్థాయి స్పందన లభించిందని పేర్కొంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు దరఖాస్తు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. వీరికి రూ.949 గరిష్ఠ ధర వద్ద షేర్లను కేటాయించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో ఎల్‌ఐసీ(LIC) ప్రకటించింది. యాంకర్‌ ఇన్వెస్టర్ల విభాగానికి 5.9 కోట్ల షేర్లను కేటాయించారు. దీంట్లో 4.2 కోట్ల షేర్లు (71.12 శాతం) 99 పథకాల ద్వారా 15 దేశీయ మ్యూచువల్‌ ఫండ్లకు కేటాయించారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, కొటాక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ పెన్షన్‌ ఫండ్‌(SBI Pension Fund), యూటీఐ రిటైర్‌మెంట్‌ సొల్యూషన్స్‌ పెన్షన్‌ ఫండ్‌ స్కీం వంటి సంస్థలు దరఖాస్తు చేసుకున్న వాటిలో ఉన్నాయి.

మానిటరీ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌, గవర్నమెంట్‌ పెన్షన్‌ ఫండ్‌ గ్లోబల్‌, బీఎన్‌పీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ వంటి విదేశీ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఎల్‌ఐసీ ఐపీఓ రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం మే 4న తెరవనున్నారు. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ (IPO)లో 22,14,74,920 షేర్లను రూ.902- 949 ధరల శ్రేణిలో విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లను ప్రభుత్వం సమీకరించనుంది. అలాగే దేశంలోనే అత్యధిక నిధులను సమీకరించిన ఐపీఓగా ఇది నిలువనుంది. ఇప్పటి వరకు 2021లో పేటీఎం సమీకరించిన రూ.18,300 కోట్లు, 2010లో కోల్‌ ఇండియా సమీకరించిన రూ.15,200 కోట్లు నిధుల సమీకరణ పరంగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్ పెట్టుబడిదారులకు రూ. 45 తగ్గింపు ఇస్తున్నారు.

Read Also.. IDFC FIRST Bank: ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల వడ్డీ రేట్లలో మార్పు..!