Anant Ambani Mobile: అనంత్ అంబానీ ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తారో తెలుసా? దాని ధర, ఫీచర్స్
ప్రపంచంలోని అగ్రశ్రేణి సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ అనే విషయం అందరికి తెలిసిందే. ఇటీవల నుంచి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ముఖ్యాంశాలలో ఉంటున్నారు. ఇటీవలే అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ప్రపంచ వ్యాప్తంగా హైలెట్ అయ్యింది..
ప్రపంచంలోని అగ్రశ్రేణి సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ అనే విషయం అందరికి తెలిసిందే. ఇటీవల నుంచి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ముఖ్యాంశాలలో ఉంటున్నారు. ఇటీవలే అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ప్రపంచ వ్యాప్తంగా హైలెట్ అయ్యింది. గణేష్ చతుర్థి సందర్భంగా ఆంటిలియాలోని ఆయన ఇంట్లో గణేష్ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాల సమయంలో అనంత్ అంబానీ కూడా ఫోన్‌ను వాడుతూ కనిపించారు. అనంత్ అంబానీ వాడుతున్న ఫోన్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్. ఆయన వాడుతున్న ఫోన్ ధర ఎంత? ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Business Idea: ఏలకుల సాగుతో లక్షల్లో లాభం.. పండించే విధానం ఏంటి?
iPhone 15 Pro Max ధర ఎంత?
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రస్తుతం డిస్కౌంట్ ఆఫర్ కింద రూ. 1,37,990కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ గత సంవత్సరం భారతదేశంలో రూ.1,59,900కి విడుదల అయ్యింది. రిలయన్స్ డిజిటల్ ప్రస్తుతం ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌పై రూ.21,990 భారీ తగ్గింపును అందిస్తోంది. ఇది కాకుండా, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ. 5,000 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. అదే సమయంలో ప్రజలు బ్యాంక్ కార్డ్‌లపై మరింత తగ్గింపు పొందడానికి ఈఎంఐ ఎంపికను ఎంచుకోవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్‌ను ఐఫోన్ స్టోర్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.
ఫోన్ ఫీచర్స్
స్మార్ట్‌ఫోన్‌ను శక్తివంతం చేయడానికి బ్యాటరీని ఉపయోగించారు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం రంగులలో లభిస్తుంది. ఇది 1290×2796 రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 128GB, 256GB, 512GB, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో ఉంది. అలాగే, 48-మెగాపిక్సెల్ (f/1.78) + 12-మెగాపిక్సెల్ (f/2.2) + 12-మెగాపిక్సెల్ (f/1.78) వెనుక కెమెరా అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి: Diabetes: మధుమేహం ఉన్నవారు చక్కెరకు బదులు తేనె, బెల్లం తీసుకుంటే మంచిదా? నిపుణులు ఏమంటున్నారు?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి