Electric Scooter: తక్కువ బడ్జెట్లో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఈ-స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కి.మీ.. పూర్తి వివరాలివి..

|

Feb 05, 2023 | 3:00 PM

తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనం కావాలి అనుకుంటున్న వారి కోసం.. మార్కెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. పోయిస్ గ్రేస్ కంపెనీ దీనిని ఆవిష్కరించింది. దీని డిజైన్, లుక్ సూపర్ గా ఉంది.

Electric Scooter: తక్కువ బడ్జెట్లో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఈ-స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కి.మీ.. పూర్తి వివరాలివి..
Poise Scooter
Follow us on

మార్కెట్లో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు కనిపిస్తున్నాయి. టాప్ బ్రాండ్లతో పాటు మనకు పేర్లు సరిగా తెలియని చాలా కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ శ్రేణి వాహనాలు మనకు దర్శనమిస్తున్నాయి. మార్కెట్లో వాటి కున్న డిమాండ్ మేరకు వాటి అమ్మకాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. అన్ని వేరియంట్లలో బెస్ట్ మోడల్ ను మనం ఎలా ఎంపిక చేసుకోవాలి? ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన ఫీచర్లతో వస్తుంటాయి. ఒక్కో రకమైన లుక్ లో, పవర్ ట్రైన్స్ లో కనిపిస్తుంటాయి. మరి అలాంటప్పుడు మెరుగైన మంచి ఎంపికను కనుక్కోవడం కొంచెం కష్టం. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ లో అధిక రేంజ్ ఉన్న స్కూటర్లను వెతికి పట్టుకోవడం చాలా టైం టేకింగ్. మీరు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారా? అయితే ఈ కథనం చదవండి.. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనం కావాలి అనుకుంటున్న వారి కోసం.. మార్కెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. పోయిస్ గ్రేస్ కంపెనీ దీనిని ఆవిష్కరించింది. దీని డిజైన్, లుక్ సూపర్ గా ఉంటాయి. దీనిని రెండు వేరియంట్లలో ఆ కంపెనీ వినియోగదారులకు అందిస్తోంది. ఈ బైక్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల వంటి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

పోయిస్ గ్రేస్ బ్యాటరీ పవర్..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 60V, 42Ah సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్‌కి 800 W పవర్ ఎలక్ట్రిక్ హబ్ మోటార్ జోడించబడింది. దీని రేంజ్, గరిష్ట వేగానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఈ స్కూటర్ లోని బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే110 నుంచి120 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. గరిష్టంగా 50 kmph వేగం తో ఈ స్కూటర్ పనిచేస్తుంది. ఈ స్కూటర్ ముందు చక్రానికి డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి డ్రమ్ బ్రేక్‌ అందుబాటులో ఉంది. దీంతో పటుకాంబి బ్రేకింగ్ సిస్టమ్ జోడించింది. సస్పెన్షన్ సిస్టమ్‌ను పరిశీలిస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్, వెనుక భాగంలో స్ప్రింగ్ ఆధారిత సస్పెన్షన్ సిస్టమ్‌ను కంపెనీ అందించింది.

సరికొత్త ఫీచర్లు..

పుష్ బటన్ స్టార్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ ఓడోమీటర్, ఎల్‌ఈడీ హెడ్ లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్, ఎల్‌ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉన్నాయి. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 34 Ah వేరియంట్‌ను రూ. 87,542 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో విడుదల చేసింది . టాప్ వేరియంట్‌కి వెళితే, ఈ ధర రూ. 92,542 అవుతుంది. దీని 42Ah వేరియంట్ ప్రారంభ ధర రూ. 93,465 ఎక్స్-షోరూమ్, ఇది ఆన్-రోడ్ అయినప్పుడు రూ. 98,965 అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..