Work From Home: ఇకచాలు.. ఆఫీసులకు వచ్చేయండి. లేదంటే ఉద్యోగం వదులుకోండి..
మునుపెన్నడూ ఈ విధానాన్ని అవలంభించని సంస్థలు సైతం కరోనా వేళ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తీసుకొచ్చాయి. దీంతో ఉద్యోగులకు ఇది సదవకాశంగా మారింది. ఎంచక్కా ఇంట్లో నుంచి పని చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి, కరోనా అంతమైపోయింది. అయినా ఇప్పటికే కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. నిజానికి కంపెనీలు ఉద్యోగులను సంస్థలకు రమ్మని చెబుతున్నా ఉద్యోగులు...

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఆర్థికం, ఆరోగ్యం ఇలా అన్ని రంగాలపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. లాక్‌డౌన్ విధింపులతో ప్రపంచమే స్థంభించింది. ఇంట్లో వాళ్లు బయటకు రాని పరిస్థితి వచ్చింది. దీంతో కంపెనీలు సైతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది.
మునుపెన్నడూ ఈ విధానాన్ని అవలంభించని సంస్థలు సైతం కరోనా వేళ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తీసుకొచ్చాయి. దీంతో ఉద్యోగులకు ఇది సదవకాశంగా మారింది. ఎంచక్కా ఇంట్లో నుంచి పని చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి, కరోనా అంతమైపోయింది. అయినా ఇప్పటికే కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. నిజానికి కంపెనీలు ఉద్యోగులను సంస్థలకు రమ్మని చెబుతున్నా ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. దీంతో కంపెనీలకు ఇదొక తలనొప్పిగా మారింది.
దీంతో ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని సంస్థలు ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసింది. అమెజాన్ సీఈవో యాండీ జెస్సీ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. వారంలో మూడు రోజులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశించారు. ఒకవేళ ఉద్యోగులు ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జెస్సీ తేల్చి చెప్పారు. ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదని, వారంలో మూడు రోజులు అందరూ ఆఫీసుకు రావాల్సిందేనని, ఈ నిబంధనలను పాటించడం ఇష్టం లేని వారు సంస్థ నుంచి వెళ్లిపోవచ్చని అమెజాన్ అల్టిమేటం జారీ చేసింది.
అయితే అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని వ్యతిరేకిస్తే గత ఫిబ్రవరిలోనే ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. మే నుంచి ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని ప్రకటించింది. అయితే ఆ సమయంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యోగులు రాజీనామా చేశారు. దీంతో కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిందేనని అమెజాన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఒక్క అమెజాన్ మాత్రమే కాకుండా మెటా సైతం ఉద్యోగులను ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని లేదంటే ఉద్యోగం మానేయాలని అల్టిమేటం జారీ చేసింది. మెటాతో పాటు గూగుల్, మైక్రోసాప్ట్ వంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులను వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..
