
ఏదో ఒక ఆశ చూపి మోసం చేయాడాన్నే ‘పిగ్ బుచరింగ్’ స్కామ్ అంటారు. సమాజంలో ఎక్కువ శాతం మంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా రకరకాల ఆశలు చూపడం ఈ స్కామ్‌లో భాగం. ఉదాహరణకు ఉద్యోగాల పేరుతో మోసం చేయడం, క్రిప్టో పెట్టుబడుల పేరుతో డబ్బు కాజేయడం లాంటివన్న మాట. ఈ తరహా స్కామ్‌లు పక్కా ప్లానింగ్‌తో జరుగుతాయి. ముందుగా వ్యక్తుల అన్ని వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు.
ఈ స్కామ్ పక్కా ప్లానింగ్ తో జరుగుతుంది. ఇది స్కామ్ అన మీరు కనిపెట్టలేని విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ తరహా స్కామర్లు మోసం కంటే ముందుగా నమ్మకాన్ని చూరగొంటారు. ఫేక్ ప్రొఫైల్స్‌తో జాబ్ రిక్రూట్‌మెంట్ కంపెనీ అని లేదా ఇన్వెస్ట్‌మెంట్ ఏజెన్సీ అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. దానికోసం ఫేక్ వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూప్స్ వంటివి కూడా క్రియేట్ చేస్తారు. జరిగేదంతా నిజమని నమ్మేలా చేసి ఆ తర్వాత అసలు స్కామ్ అమలు చేస్తారు.
పార్ట్ టైమ్ జాబ్స్, విదేశాల్లో జాబ్ ఆఫర్స్, విదేశాల్లో పనులకు కుదర్చడం, క్రిప్టో పెట్టుబడులు, ఆయిల్ ట్రేడింగ్.. ఇలా రకరకాల విధాలుగా ఈ స్కామ్స్ జరుగుతాయి. నేరుగా కాకుండా ఇతర మార్గాల్లో ఉద్యోగాలు వెతికేవాళ్లు, విదేశాలకు వెళ్లి పనిచేయాలకునేవాళ్లు, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు ఆశించేవాళ్లు, బెట్టింగ్, క్రిప్టో ట్రేడింగ్ వంటివి చేసేవాళ్లను నేరగాళ్లు టార్గెట్‌గా చేసుకుంటారు. ఇది దొంగ మార్గం అని చెప్తూనే.. తక్కువ టైంలో ఎక్కువ సంపాందించొచ్చని నమ్మిస్తారు. అలా డిపాజిట్లు, పెట్టుబడుల పేరుతో డబ్బు కాజేయడం, విదేశాలకు తీసుకెళ్లి మోసగించడం వంటివి చేస్తుంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.