Gold Mine: భారత్‌లో బయటపడ్డ పెద్ద బంగారు గని! ప్రభుత్వం ఏం చేయబోతుందంటే..

ప్రస్తుతం బంగార ధరలు ఎలా పెరుగుతున్నాయో మనకు తెలుసు. అయితే ఈ సమయంలో భారత్ తో బయటపడ్డ ఓ బంగారు గనిని ఓపెన్ చేయాలని కొంతమంది సూచిస్తున్నారు. ఇంతకీ ఆ బంగారు గని ఎక్కడ ఉంది? అందులో ఎంత బంగారం ఉంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Mine: భారత్‌లో బయటపడ్డ పెద్ద బంగారు గని!  ప్రభుత్వం ఏం చేయబోతుందంటే..
Gold Mine

Updated on: Oct 26, 2025 | 4:45 PM

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని సార్లు తగ్గుముఖం పట్టినా ఓవరాల్ గా మాత్రం ఆల్ టైం హయ్యెస్ట్ ధరలను నమోదు చేశాయి. అయితే ఈ నేపథ్యంలో బంగారు  నిల్వల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మనదేశంలో బంగారు నిల్వలు ఉంటే ఈ ధరల ఎఫెక్ట్ ఇంతగా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బీహార్ రాష్ట్రంలో గతంలో బయటపడ్డ బంగారు గనుల తెరపైకి వచ్చాయి.

బీహార్ రాష్ట్రంలో..

బీహార్ రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్నాయని ఇటీవల జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. బీహార్ లోని జాముయ్ జిల్లాలో దాదాపు 222.8 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్టు పేర్కొంది. అయితే ఈ బంగారు గనుల్లో తవ్వకాలకు ఇంకా అనుమతులు లభించలేదు. ఒకవేళ ప్రభుత్వం ఇక్కడి బంగారాన్ని వెలికి తీయడం మొదలుపెడితే భారత ఆర్థిక వ్యవస్థకు చాలా మేలు చేకూరుతుంది అంటున్నారు నిపుణులు.

బిగ్గెస్ట్ మైన్

బీహార్ లో ఉన్న బంగారు గని చాలా పెద్దది. ఇక్కడ మైనింగ్ ప్రారంభమైతే బీహార్ రాష్ట్రం.. బంగారు ఉత్పత్తికి కేంద్రంగా మారవచ్చు. అలాగే ఇది కొత్త పెట్టుబడులకు నాంది పలికే అవకాశం ఉంది. 222.8 మిలియన్ టన్నులు అంటే మొత్తం దేశంలోని బంగారు నిల్వల్లో 44 శాతానికి సమానం. కాబట్టి ఈ గోల్డ్ మైన్ ఇండియాలోనే చాలా కీలకంగా మారింది. మరి ఇక్కడ మైనింగ్ ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి