SBI customers alert: పొరపాటున మీ పిన్ నంబర్, పాస్ వర్డ్ చెప్పకూడని వారికి చెప్పేశారా.. అయితే ఇలా చేయండి..

|

Feb 24, 2022 | 6:32 PM

SBI customers alert: ఈ రోజుల్లో సైబర్ నేరాలు పెరగిన తరువాత.. చాలా మందికి గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి ఫిషింగ్(Fishing) పద్ధతుల్లో బ్యాంక్ వినియోగదారుల(Bank Customers) వివరాలను తెలుసుకుంటారు.

SBI customers alert: పొరపాటున మీ పిన్ నంబర్, పాస్ వర్డ్ చెప్పకూడని వారికి చెప్పేశారా.. అయితే ఇలా చేయండి..
Sbi Customers Alert
Follow us on

SBI customers alert: ఈ రోజుల్లో సైబర్ నేరాలు పెరగిన తరువాత.. చాలా మందికి గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి ఫిషింగ్(Fishing) పద్ధతుల్లో బ్యాంక్ వినియోగదారుల(Bank Customers) వివరాలను తెలుసుకుని వారి అకౌంట్లలో నుంచి సొమ్మును కొల్లగొడుతున్నారు. అటువంటి సందర్భం ఎదురైతే ముందుగా ఏమి చేయాలో ఇప్పుడు ఆర్బీఐ వెల్లడించింది.
ఎవరైనా కస్టమర్ తమ ఖాతాకు సంబంధించి వివరాలను, పిన్ నంబర్ లేదా ఇతర గోప్యమైన సమాచారాన్ని చెప్పకూడని వారికి తెలియజేస్తే ఏం చేయాలో ఎస్బీఐ వెల్లడించింది. ఈ కింద చెప్పిన విధంగా చేసి వారి ఖాతాలకు వాటిల్లే ముప్పును వీలైనంత తగ్గించుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ ఖాతాదారులకు చాలా సార్లు పాస్ వర్డ్, పిన్, బ్యాంకు ఖాతా వివరాల గోప్యతకు సంబంధించి పాటించాల్సిన జాగ్రత్తల గురించి చాలా సార్లు విజ్ఞప్తి చేసింది. కానీ.. అనుకోకుండా అలాంటి గోప్యమైన సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకుంటే ఇలా చేయాలి..

1. ముందుగా వినియోగదారుడు తన ఇంటర్నెట్ బ్యాంకిగ్ సేవను లాక్ చేయాలి.

2. తరువాత బ్యాంక్ శాఖ, లేదా క్రెడిట్ కార్డు విభాగాన్ని సంప్రదించాలి.

3. దీనిపై స్థానిక పోలీసులకు ముందుగా కంప్లెయింట్ ఇవ్వాలి.

4. ఎవరైనా మిమ్మిల్ని మోసగించడానికి ప్రయత్నిస్తే దానికి సంబంధించిన వివరాలను report.phishing@sbi.co.in కు మెయిల్ చేయాలి.

5. వెంటనే మీ బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ చెక్ చేసుకుని అంతా సజావుగా ఉందో లేదో గుర్తించాలి.

6. ఒకవేళ ఖాతాలో ఏవైనా లోపాలు, ట్రాన్సాక్షన్లు గుర్తిస్తే బ్యాంకుకు తెలియజేయాలి.

7. రిస్క్‌ను తగ్గించడానికి డిమాండ్ డ్రాఫ్ట్ , విశ్వసనీయ థర్డ్ పార్టీల పరిమితులను సున్నాకి సెట్ చేయడం, అధిక భద్రతను ప్రారంభించడం మొదలైన బ్యాంక్ అందించిన ఇతర పరిహార నియంత్రణలను ఉపయోగించండి.

వీటికి తోడు మీకు అధికారిక వర్గాల నుంచి వచ్చే మెసేజ్ లు, ఈ- మెయిల్ లను మాత్రమే ఓపెన్ చేయండి. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఫిషింగ్ టెక్నిక్స్ ద్వారా పంపే మెయిళ్లు, మెసేజ్ లకు వీలైనంత దూరంగా ఉండండి. అవి మీ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలను సేకరించకుండా అప్రమత్తంగా ఉండండి.

Also Read..

Loan App: ఆ లోన్ యాప్ గుర్తింపును రద్దు చేసిన RBI.. మీరూ అందులో రుణం తీసుకున్నారేమో చూసుకోండి..

Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి.. దానికోసం ఎంత అవసరం.. ఎక్కడ దాచుకోవాలి..