భారతదేశంలో వేతన జీవుల శాతం చాలా ఎక్కువ. వీరిలో మధ్యతరగతి వారు అధికంగా ఉంటారు. అయితే సంపాదన బాగా ఉన్నంత సేపు ఓకే కానీ ఒంట్లో సత్తువ లేనప్పుడు రోజువారీ జీవితం ఎలా? అని బాధపడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా వేతన జీవులకు అండ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా అండ కల్పిస్తుంది. జీతంలోంచి కొంత శాతం నిధులను జమ చేసేలా ఉద్యోగితో పాటు కంపెనీకు బాధ్యత కల్పిస్తుంది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాలకు వడ్డీ రేటును 8.15 శాతంగా ప్రకటించింది. ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కించినప్పటికీ, ఆర్థిక సంవత్సరం చివరిలో డిపాజిట్లు చేస్తారు. బదిలీ చేసిన వడ్డీ సమ్మేళనం చేస్తూ ఆ నెల బ్యాలెన్స్‌పై వడ్డీని నిర్ణయించడానికి తదుపరి నెల బ్యాలెన్స్‌కు వర్తిస్తుంది. కాబట్టి ఈ ఈపీఎఫ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఉద్యోగుల భవిష్య నిధిగా పేర్కొనే ఈ నిధి జీతం ఆధారంగా ఉంటుంది. ఒక ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతాకు నెలవారీ ప్రాతిపదికన తన ఆదాయంలో 12 శాతం జమ చేస్తారు. అంతేమొత్తంలో మన యజమాని కూడా సొమ్మును జమ చేస్తారు. దీన్ని కార్పస్ కింద కొంత, పింఛన్ కింద కొంత మొత్తం విడదీసి క్రెడిట్ చేస్తారు. అలాగే మనం పొదుపు చేసిన సొమ్ము ఈపీఎఫ్‌ఎం నెలవారీ వడ్డీని లెక్కించి ఏడాదికి ఒకసారి క్రెడిట్ చేస్తారు.
ఏడాది నుంచి ఈపీఎఫ్ సభ్యులు వడ్డీ క్రెడిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది ట్విట్టర్‌లో ఈపీఎఫ్‌ఓను ప్రశ్నిస్తున్నారు. దీనికి ఈపీఎఫ్‌ఓ స్పందిస్తూ ప్రాసెస్‌లో ఉంది. అతి త్వరలో మీ ఖాతాలో వడ్డీ చూపుతుంది. వడ్డీ జమైనప్పుడల్లా అది కూడబెట్టి పూర్తిగా చెల్లిస్తారు. వడ్డీ నష్టం ఉండదు. దయచేసి ఓపిక పట్టండని పేర్కొన్నారు. దీని ప్రకారం ఈపీఎఫ్‌ఓ వడ్డీ క్రెడిట్ అవుతుందని ఖాతాదారులు కంగారు పడకూడదు. అలాగే వడ్డీ జమైందో? లేదో? ఖాతాదారులు ఉమాంగ్ యాప్ ద్వారా లేదా యూఏఎన్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..