AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఖాతాదారులకు అలెర్ట్‌.. రేపటిలోపు ఆ పని చేయకపోతే మీ ఖాతా బ్లాక్‌

కేవైసీ అప్‌డేట్‌ చేసుకోకపోతే ఏప్రిల్ 1 నుండి ఎస్‌ఐపీలు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్), ఎస్‌డబ్ల్యూపీలు (సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్) లేదా రిడెంప్షన్‌లతో సహా ఏదైనా మ్యూచువల్‌ పండ్స్‌ లావాదేవీల్లో పాల్గొనకుండా నిషేధిస్తారు. ఈ మేరకు సీఏఎంఎస్‌ (కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్), కేఫిన్‌ టెక్నాలజీస్ (కేఫిన్‌టెక్‌) వంటి రిజిస్ట్రార్, బదిలీ ఏజెంట్ల నుంచి ఈ-మెయిల్‌లు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు పంపారు.

Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఖాతాదారులకు అలెర్ట్‌.. రేపటిలోపు ఆ పని చేయకపోతే మీ ఖాతా బ్లాక్‌
Mutual Funds
Nikhil
|

Updated on: Mar 30, 2024 | 4:05 PM

Share

ప్రస్తుత రోజుల్లో పెరిగిన అవసరాలతో పాటు టెక్నాలజీ నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే తాజాగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు మార్చి 31 లోపు తమ కేవైసీ అప్‌డేట్ చేయాల్సి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ కేవైసీ అప్‌డేట్‌ చేసుకోకపోతే ఏప్రిల్ 1 నుండి ఎస్‌ఐపీలు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్), ఎస్‌డబ్ల్యూపీలు (సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్) లేదా రిడెంప్షన్‌లతో సహా ఏదైనా మ్యూచువల్‌ పండ్స్‌ లావాదేవీల్లో పాల్గొనకుండా నిషేధిస్తారు. ఈ మేరకు సీఏఎంఎస్‌ (కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్), కేఫిన్‌ టెక్నాలజీస్ (కేఫిన్‌టెక్‌) వంటి రిజిస్ట్రార్, బదిలీ ఏజెంట్ల నుంచి ఈ-మెయిల్‌లు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు పంపారు. ఇది కేవైసీ మద్దతు లేని పెట్టుబడిదారులను పేర్కొంటుంది. ఏదైనా ‘అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రాల’ ద్వారా తప్పనిసరిగా మార్చి 31, 2024 నాటికి ప్రక్రియను మళ్లీ పూర్తి చేయాలి. కేవైసీ అప్‌డేట్‌ అనేది అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ లావాదేవీలకు తప్పనిసరి చేశారు. కేవైసీ అప్‌ డేట్‌ చేయడం ద్వారా మనీ లాండరింగ్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. మీ కేవైసీ అప్‌డేట్ కాకపోతే మీరు మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను కొనుగోలు చేయలేరు, విక్రయించలేరు లేదా రీడీమ్ చేయలేరు.

కేవైసీ అప్‌డేట్‌ చెక్‌ చేయడం ఇలా

మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌ డిస్ట్రిబ్యూటర్‌ (సాధారణ ప్లాన్‌లలో) ద్వారా పెట్టుబడి పెడితే మీ కేవైసీని మళ్లీ చేయడం అవసరమైతే వారు మీకు తెలియజేస్తారని పెట్టుబడిదారులు గమనించాలి. అయితే, మీరు స్వతంత్రంగా (డైరెక్ట్ ప్లాన్‌లలో) పెట్టుబడి పెడుతూ ఉంటే మీకు తప్పనిసరిగా నోటిఫికేషన్ అందకపోవచ్చు. మీరు సీఏఎంఎస్‌ లేదా కేఫిన్‌ టెక్‌ వంటి మీ మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించిన రిజిస్ట్రార్ మరియు బదిలీ ఏజెంట్ (ఆర్‌టీఏ) నుండి కమ్యూనికేషన్‌ను స్వీకరించి ఉండాలి. మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌తో కూడా తనిఖీ చేయాలి. 

అవసరమైన పత్రాలు

ఈ-మెయిల్‌లలో జాబితా చేసిన అధికారికంగా గుర్తించబడిన పత్రాల్లో ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, ఇతరాలు ఉంటాయి. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, యుటిలిటీ బిల్లుల వంటి పత్రాలను ఉపయోగించి నిర్వహించే కేవైసీ నిర్దేశిత గడువు తర్వాత చెల్లుబాటు కాకుండా పోతుంది.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్ ఎంపిక నిల్‌

ఆన్‌లైన్ రీ-కెవైసి ఎంపిక కాదు. పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ హౌస్ లేదా ఆర్‌టీఏలకు భౌతిక కేవైసీ ఫారమ్‌ను (అవసరమైన పత్రాలతో పాటు) సమర్పించడం ద్వారా తిరిగి కేవైసీను పూర్తి చేయాలి. అనంతరం ఈ సమాచారం కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలకు అందిస్తారు. ఆ పాన్‌ కింద చేసిన అన్ని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో కేవైసీ స్థితిని అప్‌డేట్ అవుతుంది. 

గడువు పొడగింపు

గడువు పొడగింపు విషయంలో ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. అంటే మ్యూచువల​ఫండ్స్‌ ఖాతాదారులు కచ్చితంగా మార్చి 31లోపు మీ కేవైసీను అప్‌డేట్‌ చేసుకోకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ మ్యూచువల్‌ ఫండ్స్‌ లావాదేవీలు బ్లాక్ అవుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…