March Closing: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఈ శని-ఆదివారం బ్యాంకులతోపాటు ఆ కార్యాలయాలు ఓపెన్!
ఈ వీకెండ్ చాలా మందికి లాంగ్ వీకెండ్ గా మారుతుండగా.. మరోవైపు పలు కార్యాలయాల్లో సెలవులు రద్దయ్యాయి. శని, ఆదివారాల్లో సెలవు పాటించాల్సిన చాలా కార్యాలయాలు ఈ వారాంతంలో తెరిచే ఉంటాయి. వాటిలో అనేక బ్యాంకులు, LIC, ఆదాయపు పన్ను శాఖ మొదలైన కార్యాలయాలు ఉన్నాయి.

ఈ వీకెండ్ చాలా మందికి లాంగ్ వీకెండ్ గా మారుతుండగా.. మరోవైపు పలు కార్యాలయాల్లో సెలవులు రద్దయ్యాయి. శని, ఆదివారాల్లో సెలవు పాటించాల్సిన చాలా కార్యాలయాలు ఈ వారాంతంలో తెరిచే ఉంటాయి. వాటిలో అనేక బ్యాంకులు, LIC, ఆదాయపు పన్ను శాఖ మొదలైన కార్యాలయాలు ఉన్నాయి.
బ్యాంకులు ఓపెన్
ఈ వారాంతం ఆదివారం అన్ని బ్యాంకులు తెరిరి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏజెన్సీ బ్యాంకింగ్ చేస్తున్న అన్ని బ్యాంకులు ఈ వారాంతంలో తమ శాఖలను తెరవాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది. దీంతో నేడు, రేపు అన్ని ప్రభుత్వ బ్యాంకులతో పాటు దాదాపు అన్ని ప్రైవేట్ బ్యాంకుల శాఖలు కూడా తెరుచుకోనున్నాయి. ఏజెన్సీ బ్యాంకులు ప్రభుత్వ లావాదేవీలను పరిష్కరించే బ్యాంకులు. ఏజెన్సీ బ్యాంకుల్లో 12 ప్రభుత్వ బ్యాంకులతో సహా మొత్తం 33 బ్యాంకులు ఉన్నాయి. అంటే SBI, PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ బ్యాంకుల శాఖలు, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు ఈ రోజు, రేపటి వరకు తెరిచి ఉంటాయి.
ఈ వారాంతంలో, బ్యాంకుల శాఖలు మాత్రమే కాదు, రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన అనేక కార్యాలయాలు కూడా తెరిచి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం, ప్రభుత్వ పనిలో వ్యవహరించే దాని కార్యాలయాలు కూడా శని, ఆదివారాలు తెరిచి ఉంటాయి. అంటే రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, దాని ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఈరోజు, రేపు పని చేయబోతున్నాయి.
RBI నోటిఫికేషన్ ప్రకారం, బ్యాంకులు రెండు రోజుల్లో సాధారణ వ్యాపారం చేస్తాయి. సాధారణ సమయాల ప్రకారం తెరిచి ఉంటాయి. సాధారణ ఎలక్ట్రానిక్ లావాదేవీలు రెండు రోజులు పని చేస్తాయి. అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) రెండూ మార్చి 31 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. రెండు రోజుల్లో చెక్ క్లియరింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఆదాయపు పన్ను కార్యాలయాలు
ఈ వారాంతంలో ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాలు కూడా తెరుచుకోనున్నాయి. ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కార్యాలయాలను తెరవడం గురించి తెలియజేసింది. మార్చి 18న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మార్చి 29, మార్చి 30, మార్చి 31 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాలు తెరిచి ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న పనులను మూడు రోజుల్లో పరిష్కరించేందుకు కార్యాలయం ప్రయత్నిస్తుంది.
బీమా కంపెనీల కార్యాలయాలు
వారాంతాల్లో తమ కార్యాలయాలను తెరిచి ఉంచాలని బీమా సంస్థలను బీమా నియంత్రణ సంస్థ IRDAI కోరింది. IRDA ఈ సూచన ప్రభుత్వ బీమా కంపెనీలతో పాటు ప్రైవేట్ బీమా కంపెనీలకు కూడా వర్తిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసీ ప్రత్యేక సమాచారం ఇచ్చింది. శని, ఆదివారాల తర్వాత రెండు రోజుల పాటు తమ కార్యాలయాలన్నీ పని చేస్తాయని ఎల్‌ఐసీ తెలిపింది.
మార్చి ముగింపు ప్రభావం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడం అంటే మార్చితో ముగియడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రేపటితో మార్చి 31తో ముగుస్తుంది. ఆ తర్వాత, కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 గానూ 1 ఏప్రిల్ 2024న ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు, ఆదాయపు పన్ను శాఖ, బీమా కంపెనీలకు పాత ఆర్థిక సంవత్సరపు పనిని తేల్చాలని ఒత్తిడి పెరుగుతుంది. ఇది పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయడానికి కస్టమర్లు, పన్ను చెల్లింపుదారులకు అదనపు సమయాన్ని కూడా ఇస్తుంది. మరోవైపు, చాలా మంది ఉద్యోగులకు ఇది లాంగ్ వీకెండ్‌గా మారింది. శని, ఆదివారాల్లో వారాంతపు సెలవులకు ముందు శుక్రవారం కూడా గుడ్ ఫ్రైడే రోజు కూడా సెలవు కావడం విశేషం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




