Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆకాశన్నంటుతున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..
బంగారం ధర మళ్లీ కొండెక్కి కూర్చుంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధర పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర అక్షరాలా 69 వేలకు చేరింది. ఇప్పుడే ఇలా ఉంటే.. వేసవిలో పెళ్లిళ్ల సీజన్ నాటికి ధరలు మరింత పెరిగే అవకాశముందని జనం బెంబేలెత్తిపోతున్నారు. కాగా.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.
బంగారం ధర మళ్లీ కొండెక్కి కూర్చుంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధర పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర అక్షరాలా 69 వేలకు చేరింది. ఇప్పుడే ఇలా ఉంటే.. వేసవిలో పెళ్లిళ్ల సీజన్ నాటికి ధరలు మరింత పెరిగే అవకాశముందని జనం బెంబేలెత్తిపోతున్నారు. కాగా.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా.. గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ పది గ్రాములు.. రూ.63,010, 24 క్యారెట్ల ధర రూ.68,740 గా ఉంది. కిలో వెండి ధర రూ.77,900 లుగా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్.. రూ.63,160 ఉండగా.. 24 క్యారెట్లు రూ.68,890గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.63,010, 24 క్యారెట్ల రేట్ రూ.68,740
చెన్నైలో 22క్యారెట్ల రేట్ రూ.63,910, 24క్యారెట్లు రూ.69,720
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.63,010, 24క్యారెట్ల ధర రూ.68,740
హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,010, 24క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.68,740 గా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,900, ముంబైలో రూ.77,900, బెంగళూరులో రూ.77,100, చెన్నైలో రూ.80,900, కేరళలో రూ.80,900, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో రూ.80,900 లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..