AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Insurance: ఆరోగ్య బీమా తీసుకునే వారికి అలెర్ట్‌.. ఆ విషయాలు పరిశీలించాల్సిందేనంటున్న నిపుణులు

కాబట్టి చివరి నిమిషంలో బీమా పొందే బదులు, ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండి, ఏదైనా ఆసుపత్రిలో చేరడం, చికిత్స కోసం చెల్లించాల్సిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి తగిన కవరేజీతో ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ రోజుల్లో ఆరోగ్య బీమా పథకాలు విభిన్న కవరేజ్ ప్రమాణాలతో వస్తున్నందున మీ అవసరానికి బాగా సరిపోయే పథకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

Health Insurance: ఆరోగ్య బీమా తీసుకునే వారికి అలెర్ట్‌.. ఆ విషయాలు పరిశీలించాల్సిందేనంటున్న నిపుణులు
Health Insurance
Nikhil
|

Updated on: Aug 24, 2023 | 9:00 AM

Share

ఆరోగ్య బీమా పథకాలు చందాదారులకు ఊహించని వైద్య ఖర్చులను తీర్చడంలో సహాయపడతాయి. వివిధ ఆరోగ్య బీమా పథకాలు అనేక రకాల వైద్య పరిస్థితుల కోసం చికిత్స, శస్త్రచికిత్సల ఖర్చులను కవర్ చేస్తాయి. కాబట్టి చివరి నిమిషంలో బీమా పొందే బదులు, ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండి, ఏదైనా ఆసుపత్రిలో చేరడం, చికిత్స కోసం చెల్లించాల్సిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి తగిన కవరేజీతో ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ రోజుల్లో ఆరోగ్య బీమా పథకాలు విభిన్న కవరేజ్ ప్రమాణాలతో వస్తున్నందున మీ అవసరానికి బాగా సరిపోయే పథకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఆరోగ్య బీమా తీసుకునే సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

కుటుంబ ఆరోగ్య బీమా

ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకున్నప్పుడు, మీ కుటుంబ సభ్యుల వయస్సు, వారి లింగాన్ని గుర్తుంచుకోండి. ఆరోగ్య బీమాను కొనుగోలు చేసే ముందు వారి ప్రస్తుత అనారోగ్యాలు ఏవైనా ఉంటే, అలాగే కుటుంబ వైద్య చరిత్రను పరిగణించండి. అదనంగా బీమా ప్లాన్‌ను కొనుగోలు చేసే ముందు మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా ముందుగా ఉన్న వైద్య పరిస్థితిని తనిఖీ చేయడం ఉత్తమం.

సరైన బీమా మొత్తాన్ని ఎంచుకోవడం

ఆరోగ్య బీమా ప్లాన్‌ను ఎంచుకున్నప్పుడు ఒక సంవత్సరానికి సంబంధించిన మెడికల్ బిల్లులను కవర్ చేస్తుంది. కాబట్టి ఆ మొత్తాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీరు చిన్న వయస్సులో ఉంటే మీకు అవసరమైన బీమా మొత్తం తక్కువగా ఉంటుంది. కాబట్టి వయస్సు ఇక్కడ కీలకమైన అంశం కావచ్చు. అలాగే యువ బీమా కొనుగోలుదారులకు ప్రీమియం మొత్తం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రీమియం సరసమైనది కాదా అని నిర్ణయించడానికి ఆదాయ స్థాయిలను పరిగణించాలి. యాడ్-ఆన్‌లు కూడా ముఖ్యమైనవి ఎందుకంటే అవి ప్రీమియం మొత్తాలను ప్రభావితం చేస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో తగ్గకుండా, సహేతుకమైన ప్రీమియంతో వచ్చే మొత్తాన్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి.

ఇవి కూడా చదవండి

అనుకూలమైన క్లెయిమ్‌ ప్రక్రియ

ఎల్లప్పుడూ అవాంతరాలు లేని క్లెయిమ్ పరిష్కారాన్ని అందించే పాలసీ కోసం చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బీమాదారులు మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఆరోగ్య బీమా ప్రదాత నుంచి మద్దతు కీలకం అవుతుంది. కాబట్టి ఎక్కువ కస్టమర్ దృష్టి కేంద్రీకరించే ఆరోగ్య బీమా కంపెనీని ఎంచుకోవడం మంచిది. అందువల్ల మనకు అవసరమైన సమయంలో అన్ని సపోర్ట్‌లను అందిస్తారు.

జీవితకాల పునరుద్ధరణ

జీవితకాలం పాటు పునరుద్ధరించబడే ఆరోగ్య బీమా ప్యాకేజీల కోసం చూడడం మంచిది. మీరు పెద్దవారైనప్పుడు మీరు చిన్న వయస్సులో ఉన్నవారి కంటే అనారోగ్యాలు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో జీవితకాల పునరుత్పాదకతను అందించే ఆరోగ్య పాలసీని కొనుగోలు చేయడం మంచిది.

ప్రసూతి ప్రయోజనాలు

వైద్య సదుపాయాలతో పాటు గర్భిణుల ఖర్చులు కూడా పెరిగాయి. మహిళలు ప్రసూతి ప్రయోజనాలను కలిగి ఉన్న ఆరోగ్య బీమా పథకాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రసూతి ప్రయోజనాల కోసం వేచి ఉండే సమయం, ఉప-పరిమితిని పరిగణించాలి. పాలసీ ఔట్ పేషెంట్ ఫీజులతో పాటు ఏదైనా పాలసీ మినహాయింపులను కూడా కవర్ చేస్తుందో? లేదో తనిఖీ చేయాలి.

పోస్ట్‌ వైద్య ఖర్చులు

హాస్పిటలైజేషన్‌కు ముందు లేదా తర్వాత జరిగే ఏవైనా పరీక్షలు, చికిత్సలు, ఆసుపత్రి సందర్శనలను కలిగి ఉంటుంది. అలాగే వివిధ బీమా ప్రొవైడర్‌లు ఆసుపత్రికి ముందు అంటే పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చుల కవరేజీకి సంబంధించి వేర్వేరు నియమాలు, షరతులను కలిగి ఉంటారు. మీ పాలసీ అందుకు అనుగుణంగా కవరేజీని అందిస్తుందో? లేదో? తనిఖీ చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి