AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki EVX: మారుతీ సుజుకీ ఆల్‌ ఎలక్ట్రిక్‌ కూపే.. స్పెయిన్‌లో టెస్టింగ్‌.. విడుదల ఎప్పుడంటే..?

ఈ మోడల్‌ను మొదట భారతదేశంలో ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. అయితే పలు దేశాల్లో ఈ కారును పరీక్షించిన పలు సందర్భాల్లో ఈ కారును గుర్తించారు. ఇటీవల ఈ కచ్చితమైన ఎస్‌యూవీ మరొక టెస్ట్ మ్యూల్ స్పెయిన్‌లో పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీ వివరాలు మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చాయి. ఎమోషనల్ వెర్సటైల్ క్రూయిజర్ అని కూడా పిలిచే ఈవీఎక్స్‌ మారుతి సుజుకికి సంబంధించిన మొట్టమొదటి ఈవీగా పేర్కొంటున్నారు. ఇది కూపే లాంటి ఎస్‌యూవీ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

Maruti Suzuki EVX: మారుతీ సుజుకీ ఆల్‌ ఎలక్ట్రిక్‌ కూపే.. స్పెయిన్‌లో టెస్టింగ్‌.. విడుదల ఎప్పుడంటే..?
Maruti Suzuki Evx
Nikhil
|

Updated on: Aug 24, 2023 | 9:30 AM

Share

జపనీస్ ఆటోమోటివ్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ గ్లోబల్, ఇండియన్ మార్కెట్‌ల కోసం తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనంపై పని చేస్తోందనే వాస్తవం మనందరికీ తెలుసు. ఈ మోడల్‌ను ఈవీఎక్స్‌ అని పిలుస్తారు. ఈ మోడల్‌ను మొదట భారతదేశంలో ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. అయితే పలు దేశాల్లో ఈ కారును పరీక్షించిన పలు సందర్భాల్లో ఈ కారును గుర్తించారు. ఇటీవల ఈ కచ్చితమైన ఎస్‌యూవీ మరొక టెస్ట్ మ్యూల్ స్పెయిన్‌లో పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీ వివరాలు మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చాయి. ఎమోషనల్ వెర్సటైల్ క్రూయిజర్ అని కూడా పిలిచే ఈవీఎక్స్‌ మారుతి సుజుకికి సంబంధించిన మొట్టమొదటి ఈవీగా పేర్కొంటున్నారు. ఇది కూపే లాంటి ఎస్‌యూవీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ తాజా ఈవీఎక్స్‌ అభివృద్ధి చివరి దశలో ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎస్‌యూవీ స్పెయిన్‌లో పరీక్షిస్తున్న సమయంలో ఈ కారు డిజైన్‌ గురించి అందరికీ తెలిసింది.  ఈ ఈవీఎక్స్‌ జనవరి 2024 నాటికి ప్రారంభించే అవకాశం ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కారు గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

మారుతీ ఈవీఎక్స్‌ తాజా ఫొటోలను పరిశీలిస్తే ఈ ఎస్‌యూవీ పొడవు 4,300ఎంఎం, వెడల్పు 1,800ఎంఎం, ఎత్తు 1,600 ఎంఎంగా ఉంటుందని తెలుస్తుంది. ఈవీఎక్స్‌లో క్రోమ్ బార్, సాధారణ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. రాబోయే ఈ ఎస్‌యూవీ టాప్-స్పెక్ వెర్షన్‌లలో కంపెనీ ఈ లైట్లను ఆల్ ఎల్‌ఈడీ లైటింగ్‌కి అప్‌గ్రేడ్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ రాబోయే ఎస్‌యూవీ గణనీయంగా మరింత ఆధునిక, అధునాతనంగా కనిపించే ఇంటీరియర్‌తో అమర్చబడిందని గత ఇమేజ్‌లను బట్టి తెలుస్తుంది. 

ఈ కారు రెండు-స్పోక్ ఫ్లాట్-బాటమ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్యాష్‌బోర్డ్‌లో కొత్త డిస్‌ప్లే యూనిట్, సరికొత్త డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్తగా రోటరీ డయల్‌తో పాటు సెంటర్ కన్సోల్‌ను రూపొందించారు. ప్రస్తుతానికి ఈ రాబోయే ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్‌లను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఇది సరికొత్త డెడికేటెడ్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తున్నట్లు నివేదకలు బట్టి తెలుస్తుంది. ఈ నివేదికల ప్రకారం తుది ఉత్పత్తి-స్పెక్ సుజుకి ఈవీఎక్స్‌ మోడల్ 60 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారు సుమారుగా 500-520 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
యాదాద్రిలో భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి..!
యాదాద్రిలో భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి..!
ఆ ఉదంతంపై బీసీసీఐ ఆగ్రహం.. ఐపీఎల్ జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్..!
ఆ ఉదంతంపై బీసీసీఐ ఆగ్రహం.. ఐపీఎల్ జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్..!
తెలుగు సినిమా తొలి స్టార్ కమెడియన్.. 44 ఏళ్లకే ఈ లోకాన్ని వీడారు
తెలుగు సినిమా తొలి స్టార్ కమెడియన్.. 44 ఏళ్లకే ఈ లోకాన్ని వీడారు
విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది
విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది
త్వరలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటాయా ??
త్వరలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటాయా ??
త్రీ వీలర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. మైలేజీ చూస్తే ఆశ్చర్యపోతారు!
త్రీ వీలర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. మైలేజీ చూస్తే ఆశ్చర్యపోతారు!
వాహనదారులపట్ల ట్రాఫిక్‌ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
వాహనదారులపట్ల ట్రాఫిక్‌ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
ఏసీ వాడేవారికి బిగ్‌ అలర్ట్.. ఈ తప్పులు చేశారో..
ఏసీ వాడేవారికి బిగ్‌ అలర్ట్.. ఈ తప్పులు చేశారో..
భక్తులను వణికించిన తేనెటీగలు.. ఆరుగురి పరిస్థితి విషమం!
భక్తులను వణికించిన తేనెటీగలు.. ఆరుగురి పరిస్థితి విషమం!
డబుల్ హ్యాట్రిక్‌కు సిద్ధమైన హైదరాబాద్.. ప్లేయింగ్ 11 ఇదిగో..!
డబుల్ హ్యాట్రిక్‌కు సిద్ధమైన హైదరాబాద్.. ప్లేయింగ్ 11 ఇదిగో..!