Akshaya Tritiya: తెగ కొనేశారు.. అక్షయ తృతీయ నాడు ఊపందుకున్న బులియన్ మార్కెట్

|

Apr 24, 2023 | 1:01 PM

అక్షయ తృతీయ నాడు దేశ వ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు జోరుగా సాగాయి. దాదాపు 28 కోట్ల విలువైన బంగారాన్ని శనివారం కొనుగోలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ బులియన్ అసోసియేషన్ వెల్లడించింది. అక్షయ తృతీయ రోజును హిందువులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తుంటారు. ఆ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకం..

Akshaya Tritiya: తెగ కొనేశారు.. అక్షయ తృతీయ నాడు ఊపందుకున్న బులియన్ మార్కెట్
Gold Sales
Follow us on

అక్షయ తృతీయ నాడు దేశ వ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు జోరుగా సాగాయి. దాదాపు 28 కోట్ల విలువైన బంగారాన్ని శనివారం కొనుగోలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ బులియన్ అసోసియేషన్ వెల్లడించింది. అక్షయ తృతీయ రోజును హిందువులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తుంటారు. ఆ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకం అనాదిగా కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా బంగారం, వెండి అమ్మకాలు జోరుగా సాగాయి. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఏమాత్రం పట్టించుకోకుండా పోటీపడి మరీ బంగారు, వెండి, వజ్రాభరణాలు కొనుగోలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అయితే కిలోల కిలోలు బంగారం, డైమండ్స్ కొన్నట్లు తెలుస్తోంది. ఇక బంగారం కొనుగోలు విషయంలో గతేడాది రికార్డును యూపీ ప్రజలు బద్దలు కొట్టారు. 2022లో అక్షయ తృతీయ రోజున లక్నోలో రూ.14 కోట్ల 83 లక్షల విలువైన బంగారంను కొనుగోలు చేయగా.. 2023లో అక్షయ తృతీయ రోజున ఏకంగా రూ.18 కోట్ల విలువైనా రూ.28.7 కేజీల బంగారు ఆభరణాలు కొని మురిసిపోయారు. అలాగే రూ.1 కోటి 80 లక్షల విలువైన 220 కిలోల వెండి ఆభరణాలు అమ్ముడుపోయాయి. అక్షయ తృతీయ రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.62,500గా, వెండి కిలో ధర రూ.74,500గా ఉంది.

ఈ సంవత్సరం ముఖ్యంగా యువత బంగారం,వెండితో పోలిస్తే అక్షయ తృతీయ రోజున వజ్రాలను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. లక్నోలో ఈ ఏడాది తొలిసారిగా వజ్రాల వ్యాపారం ఊపందుకుంది. అక్షయ తృతీయ రోజున నగరవాసులు రూ.4 కోట్ల 50 లక్షల విలువైన వజ్రాభరణాలను కొనుగోలు చేసినట్లు చౌక్ సరాఫా అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదిష్ జైన్ వెల్లడించారు. అక్షయ తృతీయ సందర్భంగా లక్నో బులియన్ మార్కెట్ చాలా కాలం తర్వాత మరోసారి ఊపందుకుందని ఆదిష్ జైన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.