Akshaya Tritiya 2021: అక్షయ అంటే తరగనిది అని అర్థం. వైశాఖ శుద్ధ తదియ నాడు మనం అక్షయ తృతీయ జరుపుకొంటాము. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం, పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు చాలా మంది. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని అందరూ విశ్వసిస్తారు.
శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వరాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏ లోటు ఉండదని నమ్మకం. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. భారతీయ సమాజంలో బంగారానికి ఎక్కువ విలువ ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేనంతా బంగారం మనదేశంలోనే ఉంది. బంగారం అనేది సంపదకు చిహ్నం. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందన్న నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.
అయితే ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయని, భగవంతునికి ఏది సమర్పించినా రెండింతలై మనకి తిరిగి వస్తుందని అందరూ నమ్ముతారు. అందుకే, కొద్దిగానైనా సరే బంగారం కొని భగవంతునికి సమర్పిస్తారు. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచి జరుగుతుందని కొందరు చెబుతుంటే.. అందులో ఏ మాత్రం నిజం లేదని మరి కొందరు చెబుతుంటారు. ఏది ఏమైనా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచే జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు.
అయితే ఈ సారి అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలు పెద్దగా ఉండకపోవచ్చని గోల్డ్ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే దేశంల కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగా, అందులో లాక్‌డౌన్ ఉండటం కారణాలతో బంగారం కొనడానికి కస్టమర్లు ముందుకు రాకపోవచ్చని చెబుతున్నారు. అక్షయ తృతీయ గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో అంటే ఏప్రిల్ 26న వచ్చింది. ఈ ఏడాది మే 14న వచ్చింది. చాలా రాష్ట్రాలలో లాక్డౌన్లు, కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో సేల్స్ దెబ్బతింటాయని భావిస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుని బంగారం కొనడానికి ఇష్టపడతారని తాము అనుకోవడం లేదని ఇండియన్బులియన్అండ్జ్యుయలరీ అసోసియేషన్భావిస్తోంది.
ఇవీ కూడా చదవండి: Akshaya Tritiya 2021: 1925 నుంచి 2021 వరకు పుత్తడి ప్రస్థానం.. అప్పుడు రూ.18 ఉన్న బంగారం.. ఇప్పుడు 49 వేలు
Business Idea: కరోనా పరిస్థితుల్లో సరైన వ్యాపారం.. నెలకు రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం..!
Silver Price Today: వెండి కొనుగోలు చేసేవారికి శుభవార్త.. అక్షయ తృతీయ రోజు దిగి వచ్చిన సిల్వర్ ధర..
Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. అక్షయ తృతీయ రోజు నిలకడగా ఉన్న బంగారం ధరలు