Airtel New Plans: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకువచ్చింది. రిలయన్స్ జియోకు గట్టి పోటీనిచ్చేలా ఈ ప్లాన్స్ ప్రకటించింది. అందులో ఒకటి రూ. 519, మరొకటి రూ. 779. ఈ రెండు ప్లాన్స్ ద్వారా వినియోగదారులు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 519 ప్లాన్..
ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటాతో, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల అవకాశం ఉంది. ఈ ప్లాన్ మొత్తంగా రూ. 90 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌లో అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్, ఉచిత హెలోట్యూన్, ఫాస్టాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందొచ్చు.
రూ. 779 ప్లాన్..
ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు ప్రతి రోజూ 1.5 GB హై స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. మొత్తంగా 135 GB హై స్పీడ్ డేటాను పొందుతారు.
కాగా, ఈ రెండు ప్లాన్స్ దాదాపు సేమ్ ఉంటాయి. అయితే, వ్యాలిడిటీలో తేడా ఉంటుంది. ఎక్కువ రోజులు చెల్లుబాటు కావాలంటే.. ప్లాన్ మారాల్సిందే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..