Agarwood Price: ఈ చెట్టు నిజంగా బంగారమే..! దీని కలప కిలో రూ. 73లక్షలు.. ఇప్పుడు నర్సరీల్లో అందుబాటులో..

ఆయుర్వేదంలో కూడా ఈ చెట్లకు ఎంతో విలువ ఉంది. దీనిని ఒత్తిడిని తగ్గించడానికి, నిద్రలేమిని తగ్గించడానికి, జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాలు మరింత విలువైనవి. అగర్వుడ్ కు పెరుగుతున్న డిమాండ్ దాని అక్రమ నరికివేతకు దారితీసింది. ఇది అక్విలేరియా చెట్లను అరుదైనవిగా మార్చేసింది. దీంతో ధర విపరీతంగా పెరిగేలా చేసింది. ఇప్పుడు ఈ చెట్ల పరీరక్షణ ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారింది.

Agarwood Price: ఈ చెట్టు నిజంగా బంగారమే..! దీని కలప కిలో రూ. 73లక్షలు.. ఇప్పుడు నర్సరీల్లో అందుబాటులో..
Agarwood

Updated on: Oct 23, 2025 | 9:15 PM

మీరు బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాల గురించి చాలా విని ఉంటారు. కానీ, బంగారం కంటే విలువైన కలప ఉందని మీకు తెలుసా? ఇది వజ్రాల కంటే కూడా ఎక్కువ ధరకు అమ్ముడవుతుందని తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టు..! దీని ఒక కిలో కలప ధర తెలిస్తే మీకు తల తిరుగుతుంది..! అవును, ఈ చెట్టు కలప కిలో ధర సుమారు 73 లక్షలు..వింటే షాక్‌ అవుతున్నారు కదా..? అంతేకాదు.. ఈ చెట్టు సాధారణమైనది కాదట.. దీనిని దేవతల వృక్షంగా, చెట్ల దేవుడిగా పిలుస్తారట. ఇంతటి ఖరీదైన చెట్టు సంబంధించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా వేలాది రకాల చెట్లు ఉన్నాయి. కానీ, వాటిలో అగర్వుడ్ అనేది అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన చెట్టు. ఈ చెట్టు కలప కిలోకు రూ. 2 లక్షల నుండి రూ. 73 లక్షల వరకు ఉంటుంది. ఇది బంగారం కంటే ఖరీదైనది. అంతేకాదు.. ఈ చెట్టును చెట్లకు దేవుడు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఆగ్నేయాసియాలోని వర్షారణ్యాలలో కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఈశాన్య భారతదేశంలో రైతులు ఈ చెట్లను సాగు చేస్తున్నారు. త్రిపుర రాజధాని అగర్తలా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో దీని సాగు ప్రారంభించారు. ఇది ఆర్థికంగా చాలా లాభదాయకమైన మొక్క కాబట్టి, ప్రభుత్వం, పరిశోధనా సంస్థలు ఈ చెట్ల సాగులో రైతులకు శిక్షణ ఇస్తున్నాయి. దీని మొక్కలు నర్సరీల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు.

అగర్వుడ్ చెట్టు నుంచి వచ్చే రెసిన్ ఖరీదైన పర్ఫ్యూమ్‌ల తయారీలో ఉపయోగిస్తారు. అగర్వుడ్ తో తయారు చేసిన పెర్ఫ్యూమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దీని లోతైన, ఘాటైన వెలకట్టలేనిది. అగర్వుడ్ ధూపం, నూనెను పూజ, ధ్యానం, వివిధ మతపరమైన ఆచారాలలో కూడా ఉపయోగిస్తారు. దీని సువాసన ప్రశాంతతను, పవిత్రతను కలిగిస్తుంది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలు (యు.ఏ.ఈ., సౌదీ అరేబియా, ఖతార్) ఈ సువాసనకు అధిక డిమాండ్ చూపుతున్నాయి. అదనంగా, ఈ చెట్టు కలపను ధూపాలు, విలువైన ఫర్నిచర్, మతపరమైన వస్తువుల తయారీలో కూడా వాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆయుర్వేదంలో కూడా అగర్వుడ్ కు ఎంతో విలువ ఉంది. దీనిని ఒత్తిడిని తగ్గించడానికి, నిద్రలేమిని తగ్గించడానికి, జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాలు మరింత విలువైనవి. అగర్వుడ్ కు పెరుగుతున్న డిమాండ్ దాని అక్రమ నరికివేతకు దారితీసింది. ఇది అక్విలేరియా చెట్లను అరుదైనవిగా మార్చేసింది. దీంతో ధర విపరీతంగా పెరిగేలా చేసింది. ఇప్పుడు ఈ చెట్ల పరీరక్షణ ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..