AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియంలో చోరీ.. 7నిమిషాల్లో నెపోలియన్‌ నగలు మాయం..

ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రం ఉన్న ఈ మ్యూజియంలో చోరీ జరగడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నారు. ఈ మ్యూజియంలో మెసపొటోమియా, ఈజిప్టు నాగరికతలకు చెందిన సుమారు 33 వేల పురాతన వస్తువులు, శిల్పాలు ఉన్నాయి. రోజూ దాదాపు 30 వేల మంది పర్యాటకులు, స్థానిక ప్రజలు దీనిని సందర్శిస్తుంటారు.

ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియంలో చోరీ.. 7నిమిషాల్లో నెపోలియన్‌ నగలు మాయం..
Louvre Museum Robbery
Jyothi Gadda
|

Updated on: Oct 22, 2025 | 8:03 PM

Share

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన లవ్రే మ్యూజియంలో హాఠాత్తుగా మూసివేయబడింది. పట్టపగలు మ్యూజియంలో సినీ ఫక్కీలో జరిగిన భారీ దోపిడీ ఇందుకు కారణంగా తెలిసింది. ఆదివారం అక్టోబర్ 19న కొందరు దుండగులు మ్యూజియంలోకి ప్రవేశించి, కేవలం ఏడు నిమిషాల్లోనే లూటీ చేశారు. నెపోలియన్ కాలం నాటి తొమ్మిది విలువైన ఆభరణాలను దొంగిలించి పారిపోయారు. మ్యూజియంలో చోరీ ఘటన స్థానికులతో పాటు అధికారులను కూడా షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటనలో దుండగులు ఉపయోగించిన రెండు వాహనాలు, యమహి టిమాక్స్ స్కూటర్‌పై పోలీసులు నిఘా ఉంచారు.

ముఖాలు కనిపించకుండా ఉండేందుకు ముసుగులు ధరించిన దుండగులు ఉదయం 9:30 గంటలకు మ్యూజియంలోని అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. అక్కడి షోకేస్‌ బాక్స్‌లను పగలగొట్టి నెపోలియన్ కాలానికి చెందిన తొమ్మిది అత్యంత విలువైన వస్తువులను, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే దుండగులు తమ పనిని పూర్తి చేశారు. ఉదయం 9:37 గంటలకు మ్యూజియం బయటకు వెళ్లేందుకు దొంగలు లిఫ్ట్‌కు నిప్పంటించడానికి ప్రయత్నించారు. కానీ, అక్కడి మ్యూజియం భద్రతా సిబ్బంది వారిని ఆపారు.

ఫ్రెంచ్ పోలీసుల కథనం ప్రకారం, వారు నాలుగు నిమిషాలు లోపల ఉండి, 09:38 గంటలకు బయట ఆపి ఉంచిన రెండు TMAX స్కూటర్లలో పారిపోయారు. మ్యూజియంలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం నుంచి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇందుకోసం వారు హైడ్రాలిక్ నిచ్చెన ఉపయోగించారని, ఫెన్సింగ్‌ను డిస్క్ కట్టర్లతో కట్‌ చేసి లోపలికి ప్రవేశించినట్టుగా అధికారులు గుర్తించారు. దొంగిలించబడిన ఆభరణాల విలువను ప్రస్తుతం అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి.. నిందితుల కోసం పోలీసులు 100 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వేలిముద్రలు, CCTV ఫుటేజ్‌లు, దొంగలు తప్పించుకునే మార్గాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. పారిస్ నుండి బయటకు వెళ్లే అన్ని రోడ్, హైవేలలో దొంగల గురించి ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని వెతుకుతున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రం ఉన్న ఈ మ్యూజియంలో చోరీ జరగడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నారు. ఈ మ్యూజియంలో మెసపొటోమియా, ఈజిప్టు నాగరికతలకు చెందిన సుమారు 33 వేల పురాతన వస్తువులు, శిల్పాలు ఉన్నాయి. రోజూ దాదాపు 30 వేల మంది పర్యాటకులు, స్థానిక ప్రజలు దీనిని సందర్శిస్తుంటారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..