Minimum Balance Rules: ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్‌ రిలీఫ్‌.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీల ఎత్తివేత

Minimum Balance Rules: సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహణ ఛార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. సేవింగ్స్‌ అకౌంట్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉండాలన్న నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నియమం ఈనెల అంటే జూలై 7 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది..

Minimum Balance Rules: ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్‌ రిలీఫ్‌.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీల ఎత్తివేత

Updated on: Jul 04, 2025 | 8:22 AM

Minimum Balance Rules: బ్యాంకు అకౌంట్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకుండా ఛార్జీల బాదుడు ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. కొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్‌ ఛార్జీలు ఎత్తివేసినా చాలా బ్యాంకులు ఈ విధానం కొనసాగిస్తూనే ఉన్నాయి. దేశీయంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశంలోని రెండో అతిపెద్ద బ్యాంకుగా పేరుగాంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటన చేసిన మరుసటి రోజునే మరో ప్రభుత్వ బ్యాంక్ అలాంటి కీలక ప్రకటన చేసింది. సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహణ ఛార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. సేవింగ్స్‌ అకౌంట్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉండాలన్న నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నియమం ఈనెల అంటే జూలై 7 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. రీల్స్ చేద్దామని వెళ్తే.. చివరికి జరిగిందిదే

ఇవి కూడా చదవండి

 

ఈ సేవింగ్స్‌ అకౌంట్ మినిమమ్‌ బ్యాలెన్స్‌ విధానం రద్దు చేయడంతో చాలా మంది వినియోగదారులకు ఎంతో మేలు జరుగనుంది. ఈ మేరకు సదరు బ్యాంకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Viral Video: వామ్మో..! ఏం మింగిందో ఏందో.. భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది..

ఇదిలా ఉండగా, మరో వైపు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. అకౌంట్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. జూలై 1 నుంచే అమల్లోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: ITR Filing: ఇలాంటి తప్పులు చేశారంటే రూ.1.5 లక్షల వరకు జరిమానా.. జాగ్రత్త..!

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 20వ విడత వచ్చేది అప్పుడే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి