కరెంట్ బిల్ నెలకు రూ.70 మాత్రమే.. ఉద్యోగాన్ని వదిలి సోలార్ పవర్‌తో.. వ్యాపారంలో దూసుకెళ్తున్న అభిషేక్ మానే..

|

Feb 19, 2021 | 3:00 AM

Solar Energy: సాంకేతిక పరిజ్ఞానంతోపాటు పట్టుదలతో అద్భుతాలు సృష్టించవచ్చని బెంగళూరులోని పూణే వాసి అభిషేక్ మానే నిరూపించాడు. పర్యావరణంపై మక్కువ, సాంకేతిక అధ్యయనంతో ఏకంగా రక్షణశాఖలో ఉద్యోగాన్ని..

కరెంట్ బిల్ నెలకు రూ.70 మాత్రమే.. ఉద్యోగాన్ని వదిలి సోలార్ పవర్‌తో.. వ్యాపారంలో దూసుకెళ్తున్న అభిషేక్ మానే..
Follow us on

Solar Energy: సాంకేతిక పరిజ్ఞానంతోపాటు పట్టుదలతో అద్భుతాలు సృష్టించవచ్చని బెంగళూరులోని పూణే వాసి అభిషేక్ మానే నిరూపించాడు. పర్యావరణంపై మక్కువ, సాంకేతిక అధ్యయనంతో ఏకంగా రక్షణశాఖలో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. చివరికీ సోలార్ పానల్స్ తయారీని నేర్చుకొని బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. కట్ చేస్తే ఇప్పుడు దీవా సోలార్ పవర్ సొల్యూషన్స్ అనే సంస్థను స్థాపించి ఆదర్శంగా మారాడు. బెంగళూరులోని పూణే వాసి అయిన అభిషేక్ మానే 2004లో రక్షణ శాఖలో ఉద్యోగాన్ని మానేశాడు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే సంకల్పంతో సోలార్ ప్యానెల్స్ తయారు చేయడం ప్రారంభించాడు. దీనికోసం చాలాచోట్లకు తిరిగి అధ్యయనం చేస్తూ నేర్చుకున్నాడు. చివరకు 2015లో తన సోదరి దీపాలితో కలిసి దీవా సోలార్ పవర్ సొల్యూషన్స్‌ను ప్రారంభించాడు. అంతేకాకుండా పూణేలో సోలార్ ప్యానెల్స్, వాటికి అవసరమైన ఇతర భాగాలను తయారీ చేసేందుకు ఒక యూనిట్‌ను సైతం నెలకొల్పి బిజినెస్‌లో దూసుకెళ్తున్నాడు.

గతకొంతకాలం నుంచి తన ఇంటి కరెంటు బిల్లును కేవలం రూ.70 మాత్రమే చెల్లిస్తున్నాడు. ఒకప్పుడు రూ.5వేలకు పైగా కరెంటు బిల్లు వచ్చేదని.. ఇప్పుడు దానితో అవసరం లేకుండా పోయిందని మానే పేర్కొంటున్నారు. ఎలాగంటే.. ఇంటి ఆవరణలో సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశాడు. దీనిద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్‌తో.. కిచెన్ ఉపకరణాలు, టెలివిజన్, వాషింగ్ మెషిన్, వాటర్ పంప్, ఎలక్ట్రిక్ కార్లు, బైకులు పనిచేస్తున్నాయని పేర్కొన్నాడు. ఒకప్పుడు నెలకు 5,000 రూపాయల కరెంటు బిల్లు వచ్చేదని.. ఇప్పుడు తాము నెలకు రూ .70 మాత్రమే చెల్లిస్తున్నామని అభిషేక్ చెప్పాడు. తమ వాహనాలన్నీ సౌరశక్తితోనే పనిచేస్తున్నాయని మానే పేర్కొంటున్నాడు.

250 వాట్ల విద్యుత్ ఉత్పత్తికి 10 ప్యానెల్స్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం 330 వాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతోందని పేర్కొంటున్నాడు. ఇలాంటి సంకల్పంతోనే తన సంస్థ ద్వారా దాదాపు 500 ఇళ్లల్లో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించాడు. ఏదీఏమైనా అభిషేక్ మానే సోలార్‌తో చేస్తున్న ప్రయోగాలకు అందరూ హెట్సాఫ్ అంటూ కొనియాడుతున్నారు.

Also Read: