ABHA Health Card: రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య భీమా.. కేంద్రం అందిస్తున్న ABHA హెల్త్ కార్డును ఎలా పొందాలంటే..

|

Mar 11, 2022 | 9:08 AM

ABHA Health Card: కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ (Health card) కావలసిన వారికి గొప్ప ఆరోగ్య కరమైన శుభవార్త.. ఈ హెల్త్ కార్ట్ ప్రతి ఆరోగ్యశ్రీ(Arogya Sri) హాస్పిటల్ లో చెల్లుబాటు అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ..

ABHA Health Card: రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య భీమా.. కేంద్రం అందిస్తున్న ABHA హెల్త్ కార్డును ఎలా పొందాలంటే..
Abha Health Card
Follow us on

ABHA Health Card: కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ (Health card) కావలసిన వారికి గొప్ప ఆరోగ్య కరమైన శుభవార్త.. ఈ హెల్త్ కార్ట్ ప్రతి ఆరోగ్యశ్రీ(Arogya Sri) హాస్పిటల్ లో చెల్లుబాటు అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ  ఆయుష్మాన్ భవ పథకం ఇప్పుడు ABHA హెల్త్ కార్డుగా మార్చబడింది. తాజాగా ఈ హెల్త్ కార్డు తీసుకోవడానికి కావాల్సిన  వెబ్సైట్ ఓపెన్ అయింది. ఈ సైట్ లో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ ABHA హెల్త్ కార్డ్ లభిస్తుంది.. 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది.

ఎలా రిజిస్టర్ అవ్వాలంటే: వెబ్ సైట్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ చేసి సబ్మిట్ చేసిన అనంతరం ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది.  ఆ ఓటిపి ని మరల టైప్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ను టైప్ చేయమని చెప్పి అడుగుతుంది. అప్పుడు మీ ఫోన్ నెంబర్ ను ఎంట్రీ చేసిన అనంతరం మరలా ఒక ఓటిపి వస్తుంది. అప్పుడు అడిగిన వివరాలను రిజిస్టర్ చేసిన అనంతరం.. మీ ఫోటో తో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

డౌన్లోడ్ చేసిన ఐడి కార్డును జాగ్రత్తగా ల్యామినేషన్ చేసుకుని భద్రపరచుకోవాలి. ఇదే విధంగా మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి ఆయుష్మాన్ భావ ఐడి కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ హెల్త్ కార్డుని అందరూ  అప్లై చేసుకొని హెల్త్ కు సంబంధించిన బెనిఫిట్స్ పొందగలరు.  అయితే తప్పనిసరిగా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. అప్లై చేసుకున్న ఒకే ఒక్క నిమిషాల్లో హెల్త్ కార్డు వస్తుంది.  రిజిస్టర్ చేసుకోవడానికి క్లిక్ చేయాల్సిన లింక్ https://healthid.ndhm.gov.in/  ఓపెన్ చేసి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వము ప్రవేశ పెట్టిన ఈ ఉచిత ఆరోగ్య  పథకానికి సంబంధించిన కార్డుని ఫ్యామిలీ సభ్యులు మొత్తం తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ ABHA పథకంలో చేరి..  ఈ హెల్త్ కార్డుని ఫోన్ నుండే సులభంగా పొందగలరు.

Also Read:

 5శతాబ్దాల చరిత్ర.. హనుమాన్ క్షేత్ర దర్శనం.. భూత, ప్రేత, దుష్ట గ్రహ పీడల నుంచి విముక్తి