Aadhaar-PAN: గడువులోగా ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ ఛార్జీలు

|

Feb 06, 2024 | 7:15 AM

ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వ్యవహారాల్లో పాన్‌ కార్డు తప్పనిసరి. అయితే ఈ రెండింటికి లింక్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే పెనాల్టీ ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది గడువు పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయకపోవడం వల్ల వల్ల వారు పెనాల్టీ ఛార్జీలు చెల్లించుకోవాల్సి వచ్చింది. గడువులోగా తమ పాన్‌ను ఆధార్‌ కార్డుతో అనుసంధానం ..

Aadhaar-PAN: గడువులోగా ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ ఛార్జీలు
Aadhaar - Pan Link
Follow us on

ప్రస్తుతం పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు ఎంతో ముఖ్యం. ఆధార్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. సిమ్‌ కార్డు నుంచి బ్యాంకు అకౌంట్‌ వరకు ఇలా ప్రతిదానికి ఆధార్‌ అవసరం. ఇలాగే పాన్‌ కార్డు కూడా ముఖ్యమే. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వ్యవహారాల్లో పాన్‌ కార్డు తప్పనిసరి. అయితే ఈ రెండింటికి లింక్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే పెనాల్టీ ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది గడువు పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయకపోవడం వల్ల వల్ల వారు పెనాల్టీ ఛార్జీలు చెల్లించుకోవాల్సి వచ్చింది. గడువులోగా తమ పాన్‌ను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయని డిఫాల్టర్‌ల నుంచి రూ.600 కోట్లకు పైగా పెనాల్టీని వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11.48 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది. జనవరి 29, 2024 నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్‌ల సంఖ్య 11.48 కోట్లు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చివరి తేదీ తర్వాత కూడా తమ పాన్, ఆధార్‌ను లింక్ చేయని వారి నుండి రూ. 1,000 జరిమానాగా రికవరీ అయినట్లు తెలిపింది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వ్యక్తుల నుండి జూలై 1, 2023 నుండి జనవరి 31, 2024 వరకు రుసుము రూ.601.97 కోట్లు వసూలు చేసినట్లు చౌదరి చెప్పారు. పాన్, ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30, 2023.

ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. గడువులోపు పన్ను చెల్లింపుదారులు తమ పత్రాలను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే, పాన్ కార్డులు పనిచేయవు. బయోమెట్రిక్ డాక్యుమెంట్‌తో పాన్‌ని లింక్ చేయడంలో విఫలమైతే టీడీఎస్‌, టీసీఎస్‌ తగ్గింపు/వసూళ్ల అధిక రేట్లు ఉంటాయి. రూ. 1,000 ఆలస్య జరిమానా చెల్లించడం ద్వారా పాన్‌ను మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

గడువు ముగిసిన తర్వాత కూడా తమ పాన్ – ఆధార్‌ను లింక్ చేయని వారు రూ.1,000 జరిమానా చెల్లించి రెండు పత్రాలను లింక్ చేయడం ద్వారా దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ప్రక్రియ తర్వాత, పాన్ కార్డ్ మళ్లీ యాక్టివేట్ కావడానికి దాదాపు ఒక నెల పడుతుంది. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు పాన్ కార్డ్‌ని మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు. ఈ ప్రక్రియను ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ని https://incometaxindiaefiling.gov.in/ని సందర్శించి చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి