Aadhaar Update: మీరు ఆధార్ కార్డ్‌లో పేరు, పుట్టిన తేదీ ఇతర వివరాలు ఎన్నిసార్లు మార్పు చేసుకోవచ్చు?

నేటి కాలంలో ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా మారింది. నేడు ప్రతి చిన్న, పెద్ద పనికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ పెరుగుతున్న అవసరం..

Aadhaar Update: మీరు ఆధార్ కార్డ్‌లో పేరు, పుట్టిన తేదీ ఇతర వివరాలు ఎన్నిసార్లు మార్పు చేసుకోవచ్చు?
Aadhaar Update

Updated on: Oct 26, 2022 | 10:03 AM

నేటి కాలంలో ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా మారింది. నేడు ప్రతి చిన్న, పెద్ద పనికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ పెరుగుతున్న అవసరం కారణంగా దానిని అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. చాలా మందికి ఆధార్‌లో కొన్ని వివరాలు తప్పుగా పడుతుంటాయి. ఇలాంటి తప్పులను మీరు సకాలంలో సరి చేసుకోవచ్చు. కార్డులో మీ పేరు తప్పుగా ఉన్నా, అడ్రస్‌ తప్పుగా ఉన్నా సకాలంలో సరిదిద్దుకోవచ్చు.

ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయండి

తప్పుడు సమాచారంతో ఆధార్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు సమస్యలను ఎదుర్కొవచ్చు. ఆధార్‌లోని మొత్తం సమాచారాన్ని పూర్తి చేయడం అవసరం. ఆధార్ జారీ చేసే సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కూడా ప్రజలు తమ ఆధార్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ అయిన UIDAI ఆధార్ కార్డ్‌లోని పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, లింగం మొదలైన సమాచారాన్ని మార్చుకునే సౌకర్యాన్ని అందిస్తుంది. మీరు ఆధార్‌ని ఎన్నిసార్లు అప్‌డేట్ చేయవచ్చో తెలుసుకోండి.

ఆధార్ కార్డ్‌లో పేరు: పేరులోని ఏదైనా తప్పులుంటే లేదా వివాహం తర్వాత మహిళలు తమ ఇంటిపేరును మార్చుకోవాలనుకుంటే వారు అలా చేయవచ్చు. యూఐడీఏఐ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లో పేరు మార్చడానికి అనుమతిస్తుంది. కానీ ఆధార్ కార్డ్‌లో పేరు మార్చుకోవడానికి రెండుసార్లు మాత్రమే అనుమతి ఉంటుంది. మూడు సారి కూడా మార్పులు చేయాలంటే కుదరదు.

ఇవి కూడా చదవండి

లింగం: ఆధార్ కార్డ్‌లో మీ లింగాన్ని తప్పుగా నమోదు చేసిన తర్వాత మీరు లింగాన్ని మార్చుకోవచ్చు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. ఇందులో మార్పులు చేయవచ్చు. అయితే లింగాన్ని మార్చుకునేందుకు ఒకే ఒక్కసారి మాత్రమే అనుమతి ఇస్తుంది.

పుట్టిన తేదీ మార్పులు: ఎవరైనా ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేసినట్లయితే అది ఒక్కసారి మాత్రమే మార్పు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత అందులో ఎలాంటి మార్పులు చేయలేం.

ఇంటి చిరునామా: ఇంటి చిరునామా, ఇమెయిల్ ID, మొబైల్ నంబర్, ఫోటో (ఫోటోగ్రాఫ్), ఫింగర్ ప్రింట్, ఐ స్కాన్‌తో దీన్ని మీ ఆధార్‌లో అప్‌డేట్ చేయడానికి ఎటువంటి పరిమితి లేదు. మీరు ఎన్నిసార్లు అయినా అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వాటిని అప్‌డేట్ చేయడానికి ఎటువంటి పరిమితి విధించబడలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి