ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఆధార్ కార్డ్ ఒకటి. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు, గానీ ఇతర వాటికి ఈ పత్రం మీ గుర్తింపు రుజువుగా పనిచేస్తుంది. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ కార్డ్, పాన్ లింక్ చేయాల్సి ఉంటుంది. ఐరిస్ స్కాన్, వేలిముద్ర, ఏదైనా వ్యక్తి ఫోటో ఈ ఆధార్ కార్డుతో అనుసంధానించబడి ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ ఆధార్ కార్డు ఆధారంగా మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆధార్ కార్డు వెరిఫికేషన్ ముఖ్యం. ఇప్పుడు QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆధార్ కార్డు ప్రామాణికతను సులభంగా ధృవీకరించడం సాధ్యమవుతుంది. QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ఆధార్ కార్డ్ నకిలీ లేదా అసలైన వాటిని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.
ఆధార్‌లో 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఈ నంబర్‌తో ఆధార్ కార్డును వెరిఫై చేసుకోవచ్చు. QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా కూడా ధృవీకరించవచ్చు. దీని ద్వారా ఆధార్ కార్డు నకిలీదో, అసలైనదో తెలుస్తుంది. ఆధార్ కార్డు సమాచారం సరియైనదా, తప్పా అన్నది కూడా తేలనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి