మనకున్న డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఎంతో ముఖ్యం. అయితే చాలా మంది ఆధార్ కార్డులోని వివరాలు తప్పుగా ఉన్నాయి. వాటిని సరి చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ సెంటర్లలో తిరుగుతుంటారు. ఆధార్‌లో తప్పులు ఉండటం కారణంగా సమస్యలు వస్తుంటాయి.
ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ యూఐడీఏఐ ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, లింగం మొదలైన వాటిని మార్పులు చేసుకునే వెలసులుబాటు కల్పించింది యూఐడీఏఐ. అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కార్డులో ప్రతి సమాచారాన్ని పదేపదే మార్పు చేసుకునేందుకు కుదరదు.
అయితే బయోమెట్రిక్ వివరాలు కలిగి ఉన్నందున ఆధార్ కార్డు ఇతర పత్రాలకంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రతి అవసరానికి ఆధార్ కార్డు తప్పనిసరి అవసరమైన ఉన్నందున కార్డులోని వివరాలు అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల మీ కార్డులో కూడా ఏదైనా సమాచారం తప్పుగా నమోదు అయితే వెంటనే సరి చేసుకోండి. కార్డులోని వివరాలు ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ముందుగా సరి చేసే వివరాలు మళ్లీ మళ్లీ తనిఖీ చేయండి. ఎక్కువ సార్లు మార్పులు చేస్తే కుదరదు.
ఆధార్ కార్డులో, పేరులో తప్పులు దొర్లినట్లయితే సరి చేసుకునేందుకు కేవలం రెండు సార్లు మాత్రమే అవకాశం ఉంటుందని గుర్తించుకోండి. ఏదైనా పొరపాటు ఉంటే లేదా వివాహం తర్వాత మహిళలు తమ ఇంటిపేరును మార్చుకోవాలనుకుంటే వారు అలా చేయవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లో పేరు మార్చుకునే అవకాశం ఉంది. మీరు ఆధార్ కార్డ్‌లో పేరు అప్‌డేట్ చేసుకోవాలంటే రెండుసార్లు మాత్రమే చేసుకోవచ్చు.
ఇక ఆధార్ తయారు చేస్తున్న క్రమంలో ఒక్కోసారి లింగం తప్పుగా పడుతుంది. దానిని సరి చేసుకునేందుకు యూఐడీఏఐ నిబంధనల ప్రకారమే మార్చుకునేందుకు వీలుటుంది. ఆధార్ కార్డ్‌లో లింగాన్ని అప్‌డేట్ చేయడానికి మీకు ఒకే ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది.
అలాగే ఆధార్‌లోని పుట్టిన తేదీ కూడా చాలా మందికి తప్పుగా పడుతుంది. పుట్టినత ఏదీ సరిగ్గా లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అలాంటి సమయంలో పుట్టిన తేదీని సరి చేసుకునేందుకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది.
ఆధార్‌లోని కొన్ని వివరాలు ఎన్ని సార్లు అయినా మార్చుకునేందుకు వీలుంది. కార్డులోని ఇంటి చిరునామా, ఇమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఫోటో, వేలిముద్రలు, ఐ స్కాన్ వంటివి ఎన్ని సార్లు అయినా అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటికి ఎలాంటి పరిమితి విధించలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి