Aadhaar Card: ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డును అప్‌డేట్ చేయాలా? UIDAI ఏం చెప్పింది?

|

Aug 25, 2024 | 3:38 PM

భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఆధార్ కార్డ్ అనేది వ్యక్తిగత గుర్తింపు కార్డు మాత్రమే కాదు, కీలకమైన చిరునామా సర్టిఫికేట్ కూడా. స్కూల్, కాలేజీ, మెడికల్, ట్రావెల్, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేయడం ఇలా ప్రతిదానికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు లేకుండా చాలా పనులు చేయడం అసాధ్యం. ఆధార్ కార్డు అంత ముఖ్యమైన పత్రం కావడంతో ఆధార్ కార్డులోని వివరాలను ప్రతి 10 సంవత్సరాలకు..

Aadhaar Card: ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డును అప్‌డేట్ చేయాలా? UIDAI ఏం చెప్పింది?
Aadhaar Card
Follow us on

భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఆధార్ కార్డ్ అనేది వ్యక్తిగత గుర్తింపు కార్డు మాత్రమే కాదు, కీలకమైన చిరునామా సర్టిఫికేట్ కూడా. స్కూల్, కాలేజీ, మెడికల్, ట్రావెల్, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేయడం ఇలా ప్రతిదానికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు లేకుండా చాలా పనులు చేయడం అసాధ్యం. ఆధార్ కార్డు అంత ముఖ్యమైన పత్రం కావడంతో ఆధార్ కార్డులోని వివరాలను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్ చేయాలని చెబుతున్నారు. ఇలాంటప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డును ఎందుకు అప్‌డేట్ చేయాలి? ఏం లాభం? అప్‌డేట్‌ చేయకపోతే ఏమవుతుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Central Bank: డిసెంబర్‌లో రూ.5000 నోట్లు విడుదల.. ఆ సెంట్రల్‌ బ్యాంకు కీలక ప్రకటన

ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డును రెన్యూవల్ చేసుకోవాలి

ఆధార్ కార్డ్‌లోని పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని కనీసం 10 సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్ చేయాలని UIDAI సిఫార్సు చేస్తోంది. ఎందుకంటే ఈ సమాచారం మారవచ్చు. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ద్వారా మీరు ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ సేవలను పొందడం కొనసాగించవచ్చు. ఆధార్ కార్డును క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం వల్ల మోసం, నేర సంఘటనలను నివారించవచ్చు. అంతే కాకుండా ఆధార్ కార్డును క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం వల్ల బ్యాంక్ ఖాతా తెరవడం లేదా లోన్ కోసం దరఖాస్తు చేయడం వంటి ఆర్థిక సమస్యలను నివారించవచ్చు.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ని ఎలా అప్‌డేట్ చేయాలి?

  • ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/en/ సందర్శించాలి.
  • ఆధార్ నంబర్‌తో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, Send OTPపై క్లిక్ చేయండి.
  • అప్పుడు మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేసి లాగిన్ చేయండి.
  • దీని తర్వాత, UIDAI వెబ్‌సైట్‌లో కనిపించే పేజీలో, చిరునామా అప్‌డేట్‌పై క్లిక్ చేసి, ఆపై అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్‌పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీరు అప్‌డేట్ చేయాల్సిన సమాచారాన్ని నమోదు చేసి ప్రాసెస్ టు అప్‌డేట్ ఆధార్‌పై క్లిక్ చేయాలి.
  • పై విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు ఆధార్ కార్డును సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Train Coaches: సూపర్‌ఫాస్ట్ రైళ్లలో రెడ్ కలర్‌ బోగీలు ఎందుకు ఉంటాయో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి