T+0 Settlement System: పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. పెట్టుబడిదారులు, వ్యాపారులకు పండగే..!

తాజా టీ+0 సెటిల్‌మెంట్ సైకిల్‌లో పెట్టుబడిదారులు తమ డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను అదే రోజున పొందే అవకాశం ఉంటుంది. టీ అనేది వాణిజ్య దినం. అయితే 0 అనేది సెటిల్‌మెంట్ కోసం తీసుకున్న రోజుల సంఖ్య. ఉదాహరణకు మీరు సోమవారం నాడు షేరును కొనుగోలు చేస్తే, ప్రస్తుతం మంగళవారం కాకుండా అదే రోజు (సోమవారం) మీ డీమ్యాట్ ఖాతాలో జమ అవుతుంది.

T+0 Settlement System: పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. పెట్టుబడిదారులు, వ్యాపారులకు పండగే..!
Stock Market
Follow us

|

Updated on: Mar 29, 2024 | 7:05 PM

గత సంవత్సరం స్టాక్ మార్కెట్‌లో ‘టీ+1’ (ట్రేడింగ్ డే ప్లస్ వన్) సెటిల్‌మెంట్ సైకిల్‌కు పూర్తిగా మారిన మొదటి దేశంగా అవతరించిన తర్వాత భారతదేశం మార్చి 28, 2024న అదే రోజు షేర్ సెటిల్‌మెంట్ సిస్టమ్‌ను (టీ+0) ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సిస్టమ్‌ను ‘బీటా’ మోడ్‌లో రూపొందించారు. ఇది ప్రస్తుతానికి ఎంపిక చేసిన 25 షేర్ల వరకు అందుబాటులో ఉంటుంది. పైగా ఈ సిస్టమ్ కొంతమంది బ్రోకర్ల ద్వారా అందిస్తున్నారు. కొత్త సంక్షిప్త ట్రేడింగ్ సైకిల్ గురించి, పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన విషయాలను మరిన్ని వివరాలను తెలుసుకుందాం. తాజా టీ+0 సెటిల్‌మెంట్ సైకిల్‌లో పెట్టుబడిదారులు తమ డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను అదే రోజున పొందే అవకాశం ఉంటుంది. టీ అనేది వాణిజ్య దినం. అయితే 0 అనేది సెటిల్‌మెంట్ కోసం తీసుకున్న రోజుల సంఖ్య. ఉదాహరణకు మీరు సోమవారం నాడు షేరును కొనుగోలు చేస్తే, ప్రస్తుతం మంగళవారం కాకుండా అదే రోజు (సోమవారం) మీ డీమ్యాట్ ఖాతాలో జమ అవుతుంది. డీమ్యాట్ ఖాతా అంటే షేర్లను డిజిటల్‌గా ఉంచే ఖాతా. ప్రస్తుతం భారతదేశం టీ+1 సైకిల్‌ను అనుసరిస్తోంది అంటే ట్రేడ్‌లు మరుసటి రోజుతో పరిష్కరిస్తారు.

పెట్టుబడిదారులకు, వ్యాపారులకు ప్రత్యేక సాయం

కుదించబడిన షేర్ సెటిల్‌మెంట్ సైకిల్ వేగంగా నిధుల రోలింగ్ కారణంగా మార్కెట్‌లో లిక్విడిటీని పెంచుతుంది. తక్షణ లిక్విడిటీని చూసే వ్యాపారులు, పెట్టుబడిదారులకు టీ+0 సెటిల్‌మెంట్‌ను ప్రవేశపెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిధులను వినియోగించుకోవడానికి, మార్కెట్‌పై త్వరగా స్పందించడానికి వీలు కల్పిస్తుంది. మార్కెట్‌లోకి పరిమిత నగదుతో వచ్చే రిటైల్‌కు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదే చిన్న పెట్టుబడిదారులకు ఇది ట్రేడింగ్ ల్యాండ్‌స్కేప్‌ను విప్లవాత్మకంగా మారుస్తుంది. సెటిల్‌మెంట్ సైకిల్‌ను కుదించడం అంటే స్వింగ్ ట్రేడర్‌లకు సరైన సమయానికి రాబడులు రావడానికి నిధులను సరైన రీతిలో వినియోగించడమని నిపుణులు పేర్కొంటునలనారు. ఈ మార్పు రిటైల్ పెట్టుబడిదారులకు రిస్క్ ఎక్స్‌పోజర్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. సిస్టమ్ ఫండ్స్ మరియు సెక్యూరిటీలకు ఒకే రోజు యాక్సెస్‌ను హామీ ఇస్తుంది. తద్వారా కౌంటర్‌పార్టీ మరియు డ్యూరేషన్ రిస్క్‌లను తగ్గిస్తుంది. అయితే అధిక మొత్తంలో ట్రేడ్‌ల కారణంగా అన్ని కౌంటర్‌పార్టీలకు ప్రారంభ రోజుల్లో కొన్ని సాంకేతిక పరిమితులు, లోపాలు ఉండవచ్చు, తాప్సే చెప్పారు.

టీ+0 సెటిల్మెంట్ సిస్టమ్ అందించే 25 షేర్లు 

బీఎస్ఈ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఒకే రోజు సెటిల్‌మెంట్ కోసం 25 కంపెనీల షేర్లు అందుబాటులో ఉంటాయి. అంబుజా సిమెంట్స్, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, బిర్లాసాఫ్ట్, సిప్లా, కోఫోర్జ్, దివీస్ లేబొరేటరీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, జేఎస్‌డబ్ల్య స్టీల్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, ఎంఆర్ఎఫ్, నెస్ట్‌లే ఇండియా, ఎన్ఎండీసీ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా కమ్యూనికేషన్స్, ట్రెంట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వేదాంత షేర్లు అందుబాటులో ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి