Water Crisis: ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్.. నీటి కొరత లేని రాష్ట్రమంటూ ఐటీ కంపెనీలకు లేఖ

బెంగళూరులో నీటి సంక్షోభం నేపథ్యంలో తమ రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతో పాటు పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయని ఐటీ కంపెనీలకు రాసింది. తమ రాష్ట్రంలో చిన్నవి, పెద్దవిగా 44 నదులు ఉన్నాయి కాబట్టి నీటి సమస్య అస్సలు ఉండదని, అందువల్ల తమ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు పెట్టాలని కోరింది. బెంగుళూరు భారతదేశానికి 254 బిలియన్ల ఆదాయ ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉంది.

Water Crisis: ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్.. నీటి కొరత లేని రాష్ట్రమంటూ ఐటీ కంపెనీలకు లేఖ
It Sector
Follow us

|

Updated on: Mar 29, 2024 | 6:36 PM

భారతదేశంలో టెక్ హబ్‌లో బెంగుళూరు ప్రధానమైన నగరంగా ఉంది. బెంగుళూరులో నీటి సంక్షోభం ఉన్నట్లు నివేదికలు వెలువడిన తర్వాత కేరళ రాష్ట్రంలో ఐటీ విస్తరణ కోసం పరిగణించాలని కేరళ ప్రభుత్వ బెంగళూరులోని అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీలకు లేఖ రాసింది. బెంగళూరులో నీటి సంక్షోభం నేపథ్యంలో తమ రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతో పాటు పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయని ఐటీ కంపెనీలకు రాసింది. తమ రాష్ట్రంలో చిన్నవి, పెద్దవిగా 44 నదులు ఉన్నాయి కాబట్టి నీటి సమస్య అస్సలు ఉండదని, అందువల్ల తమ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు పెట్టాలని కోరింది. బెంగుళూరు భారతదేశానికి 254 బిలియన్ల ఆదాయ ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉంది. ప్రస్తుతం వేసవి ప్రారంభంతో దాదాపు 500 మిలియన్ లీటర్ల రోజువారీ నీటి కొరతతో ఇబ్బంది పడుతోంది. ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి కేరళ ప్రభుత్వ చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ప్రెస్టీజ్ గ్రూప్ కొచ్చిలో 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టెక్ పార్క్‌ను నిర్మించగా తిరువనంతపురంలో బ్రిగేడ్ గ్రూప్ అదే తరహాలో పార్కును నిర్మిస్తోంది. కొచ్చిలోని ఇన్ఫోపార్క్ సొంత సౌకర్యాలను కలిగి ఉంది. అలాగే ప్రైవేట్ డెవలపర్లు బ్రిగేడ్, కార్నివాల్, లులు గ్రూప్, ఆసియా సైబర్ పార్క్ ద్వారా నిర్మించబడ్డాయి. కేరళలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయని మంచి రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ కూడా ఉన్నాయని కేరళ ప్రభుత్వం లేఖలో వివరించింది. పెట్టుబడుల కోసం రాష్ట్రం చేసిన అభ్యర్థనను కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. తమ రాష్ట్రాన్ని సిలికాన్ వ్యాలీ తరహాలో అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. టెక్నాలజీ గ్రాడ్యుయేట్లతో టెక్ సెక్టార్‌ని హోస్ట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేరళ మంత్రి రాజీవ్ చెప్పారు.

కేరళ రాష్ట్రంలో ఇన్ఫోపార్క్ (కొచ్చి), టెక్నోపార్క్ (తిరువనంతపురం), సైబర్‌పార్క్ (కోజికోడ్) మూడు ఏర్పాటు చేసిన సౌకర్యాలకు నిలయంగా ఉండగా తాజా పెట్టుబడులకు మద్దతుగా ప్రభుత్వం ప్రతిపాదిత కారిడార్‌లలో చిన్న టెక్ పార్కులను ఏర్పాటు చేస్తుందని మంత్రి రాజీవ్ తెలిపారు. భారతదేశంలో బహుళజాతి దిగ్గజం కోసం కొచ్చి వేగంగా అభివృద్ధి చెందుతున్న ల్యాబ్ అని, సుమారు 30 నెలల్లో దాని సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. కొచ్చిలో ఐబీఎంకు సంబంధించిన పెట్టుబడులు, విస్తరణ, ఇతర సాంకేతిక సంస్థల ద్వారా మరిన్ని పెట్టుబడులకు ఆజ్యం పోస్తుందని, ఇది అధిక-చెల్లింపు ఉద్యోగాల సృష్టికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఐదేళ్లలో టెక్ సెక్టార్‌లో పనిచేస్తున్న కార్మికుల హెడ్‌కౌంట్‌ను పది లక్షలకు చేర్చాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కేరళ రాష్ట్రం పెట్టుకుంది. 

ఇవి కూడా చదవండి

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన టెక్ పార్కుల్లో దాదాపు 2.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీన్ని నాలుగు రెట్లు తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి రాజీవ్ తెలిపారు. ఇప్పటికే కేరళలోని యూనివర్సిటీల నేతృత్వంలో సైన్స్ పార్కులను నెలకొల్పుతోంది. తిరువనంతపురంలో భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ విశ్వవిద్యాలయం రానుంది. ప్రభుత్వం తిరువనంతపురంలో డిజిటల్ సైన్స్ పార్క్, కన్నూర్, కేరళ మరియు కొచ్చి (కుశాట్) విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలో మరో మూడు సైన్స్ పార్కులను ఏర్పాటు చేస్తుంది. ఈ పార్కులన్నీ కొత్త సాంకేతిక సంబంధిత పరిశ్రమలపై దృష్టి సారిస్తాయి. రాష్ట్ర స్టార్టప్ మిషన్ కింద దాదాపు 5,000 స్టార్టప్‌లు నమోదయ్యాయి. ఇవి 10,000 ఉద్యోగాలను సృష్టించగలవని అంచనా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం