AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2,000 Notes: ఆర్బీఐ కీలక ప్రకటన.. ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు.. కారణం ఏంటంటే..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన 19 కార్యాలయాల్లో ఏప్రిల్ 1న రూ. 2000 నోట్ల మార్పిడి, డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదని ఆర్బీఐ తెలిపింది. ఖాతాల వార్షిక ముగింపుకు సంబంధించిన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసేందుకు ఇది కారణమని పేర్కొంది..

2,000 Notes: ఆర్బీఐ కీలక ప్రకటన.. ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు.. కారణం ఏంటంటే..
Rbi
Subhash Goud
|

Updated on: Mar 29, 2024 | 6:13 PM

Share

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన 19 కార్యాలయాల్లో ఏప్రిల్ 1న రూ. 2000 నోట్ల మార్పిడి, డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదని ఆర్బీఐ తెలిపింది. ఖాతాల వార్షిక ముగింపుకు సంబంధించిన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసేందుకు ఇది కారణమని పేర్కొంది.

సదుపాయం తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఏప్రిల్ 2 నుంచి ఈ సదుపాయం పునఃప్రారంభమవుతుందని ఆర్‌బీఐ తెలిపింది. మే 19, 2023 నుండి రిజర్వ్ బ్యాంకుకు చెంది ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్ల మార్పిడికి సౌకర్యం అందుబాటులో ఉంది. అక్టోబర్ 9, 2023 నుండి, ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు కూడా వ్యక్తుల నుండి రూ.2000 నోట్లను స్వీకరించడం ప్రారంభించాయి.

ఎన్ని రూ.2000 నోట్లు తిరిగి వచ్చాయి?

మార్చి 1, 2024 నాటికి మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 కరెన్సీ నోట్లలో 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. మే 19, 2023న బ్యాంకింగ్‌ సమయం ముగిసే సమయానికి రూ.3.56 లక్షల కోట్ల నుండి 2024 ఫిబ్రవరి 29న బ్యాంకింగ్ పని వేళలు ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ 8,470 కోట్లకు తగ్గిందని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ తన క్లీన్ నోట్ పాలసీలో భాగంగా మే 19, 2023న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. చలామణిలో ఉన్న మొత్తం రూ.500, రూ.1,000 నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించుకున్న తర్వాత ఆర్బీఐ నవంబర్ 2016లో రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి