EPluto 7G: 201 కిలోమీటర్ల రేంజ్‌తో ప్యూర్ ఈవీ నుంచి నయా స్కూటర్.. ఫీచర్లు తెలిస్తే ఎగిరిగంతేస్తారంతే..!
ఈ ప్లూటో ధర 7జీ మ్యాక్స్ ధర రూ.1,14,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. అయితే ఆయా రాష్ట్రాల సబ్సిడీలతో పాటు ఆర్‌టీఓ రుసుములను బట్టి ఆన్ రోడ్ ధర మారుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్, స్మార్ట్ ఏఐ వంటి ఫీచర్లతో ఈ స్కూటర్‌ను అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ఫీచర్లు బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడతాయని కంపెనీ పేర్కొంది.
ప్రముఖ ఈవీ తయారీదారు ప్యూర్ ఈవీ సరికొత్త స్కూటర్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈప్లూటో 7 జీ మ్యాక్స్ పేరిట రిలీజ్ చేసిన ఈ స్కూటర్‌ను 201 కిలోమీటర్ల మైలేజ్‌పరిధితో విడుదల చేసింది. ఈ ప్లూటో ధర 7జీ మ్యాక్స్ ధర రూ.1,14,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. అయితే ఆయా రాష్ట్రాల సబ్సిడీలతో పాటు ఆర్‌టీఓ రుసుములను బట్టి ఆన్ రోడ్ ధర మారుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్, స్మార్ట్ ఏఐ వంటి ఫీచర్లతో ఈ స్కూటర్‌ను అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ఫీచర్లు బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడతాయని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ ప్రస్తుతం భారతదేశం అంతటా బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. వచ్చే పండుగ సీజన్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అలాగే ఈ స్కూటర్ నాలుగు రంగులలో లభిస్తుంది. మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఈప్లూటో 7 జీ మ్యాక్స్ మోడల్‌లో ఏఐఎస్-156 సర్టిఫికెట్ పొందిన 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్రత్యేకతగా నిలుస్తుంది. అలాగే స్మార్ట్ బీఎంఎస్, బ్లూటూత్ కనెక్టివిటీతో ఈ స్కూటర్ ఆకర్షణీయంగా ఉంటుంది. పవర్‌ట్రెయిన్ 2.4 కేడబ్ల్యూ వద్ద గరిష్ట శక్తిని కలిగి ఉంది. ముఖ్యంగా ఈ స్కూటర్ మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్‌లను అందిస్తుంది. అలాగే ఏడు వేర్వేరు మైక్రోకంట్రోలర్‌లు, అనేక సెన్సార్‌లతో అమర్చినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్యూర్ ఈవీ నుంచి భవిష్యత్ ఓటీఏ ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది. ప్యూర్ ఈవీ కంపెనీ తన డీలర్ నెట్‌వర్క్‌ను అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో విస్తరిస్తోంది 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 300 కంటే ఎక్కువ టచ్ పాయింట్‌లను లాంచ్ చేయాలని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
అత్యధికంగా అమ్ముడవుతున్న 7జీ మోడల్ అప్‌గ్రేడ్ వెర్షన్ రోజుకు 100 కి.మీ డ్రైవ్ చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్యూర్ ఈవీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ వదేరా తెలిపారు. ముఖ్యంగా ఈ బైక్‌లో బ్రేకింగ్ అనుభవం మెరుగుపర్చారు. బ్రేకింగ్ దూరం, ఆపే సమయం, చక్రం తిరిగే వేగం, బ్రేకింగ్ ఫోర్స్ పరంగా గణనీయంగా మెరుగుపర్చారు. ఇది ముందు మరియు వెనుక బ్రేక్‌ల జీవిత చక్రాన్ని 30 శాతం మెరుగుపరుస్తుంది. శ్రేణి, భద్రతను మెరుగుపరచడానికి కోటింగ్ రీజెన్‌తో సహా ఈఏసీ బ్రేకింగ్ సిస్టమ్‌తో స్మార్ట్ రీజెన్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంది. ఈ స్కటూర్‌ను 5 కేఎంపీహెచ్ స్థిరమైన వేగంతో ఆటో పుష్ చేయడానికి మ్యాక్స్ రివర్స్ మోడ్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్ ఫీచర్‌లను కలిగి ఉంది. 60,000 కిమీల ప్రామాణిక బ్యాటరీ వారెంటీను, 70,000 కిమీల పొడిగించిన వారెంటీను అందిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..