Electric Scooter: పోష్ అండ్ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆటో రిపేర్ ఫీచర్తో మార్కెట్లోకి ఎంట్రీ..
ఎంఎక్స్‌మోటో కంపెనీ కొత్త ఎంఎక్స్‌వీ ఎకో పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటిలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. సింగిల్ చార్జ్ పై 80 నుంచి 100కిలోమీటర్లు ఇచ్చే వేరింయట్ ధ రూ. 84,999(ఎక్స్ షోరూం)కాగా.. 105 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే వేరియంట్ ధర రూ. 94,999(ఎక్స్ షోరూం)గా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణహిత వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా కంపెనీలు ఎలక్ట్రిక్ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల కాలం బాగా ప్రాచుర్యం పొందుతున్న ఎంఎక్స్‌మోటో కంపెనీ కొత్త ఎంఎక్స్‌వీ ఎకో పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటిలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. సింగిల్ చార్జ్ పై 80 నుంచి 100కిలోమీటర్లు ఇచ్చే వేరింయట్ ధ రూ. 84,999(ఎక్స్ షోరూం)కాగా.. 105 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే వేరియంట్ ధర రూ. 94,999(ఎక్స్ షోరూం)గా ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పోష్ అండ్ పవర్ ఫుల్..
ఈ స్కూటర్లు కేవలం తక్కువ ధరకే లభించడంతో పాటు సరికొత్త ఫీచర్లతో ప్యాక్ అయ్యిందని ఎంఎక్స్ మోటో మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర మల్హోత్రా అన్నారు. దీనిలో 6 అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్, 3000 వాట్ల బీఎల్డీసీ హబ్ మోటార్, అధిక సామర్థ్యంతో కూడిన రీజనరేటివ్ బ్రేకింగ్ తో వస్తుందని తెలిపారు. ఈ పోష్ అండ్ పవర్ ఫుల్ స్కూటర్లో లైఫ్ పీఓ04 బ్యాటరీలు ఉంటాయని.. వీటి నాణ్యత, పనితీరు, అధిక సామర్థ్యం కలిగి ఉంటాయని చెప్పారు.
సేఫ్ బ్యాటరీలు..
లైఫ్ పీఓ4 బ్యాటరీలు సేఫ్టీకి పెట్టింది పేరు. తక్కువ పరిమాణంలోనే అధిక స్థాయి శక్తిని ఇవి స్టోర్ చేయగలవు. దీంతో ఈ బ్యాటరీలు తక్కువ సైజ్, తక్కువ బరువుతో ఉంటాయి. వీటి సాయంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల అధిక దూరం ట్రావెల్ చేయగలుగుతాయి. ఎక్కువ దూరాలు ప్రయాణించే వారికి కూడా ఇవి చక్కగా సరిపోతాయి.
స్పెసిఫికేషన్లు..
ఈ స్కూటర్లో 3000వాట్ల బీఎలడీసీ హబ్ మోటార్ ఉంటుంది. 580 ఆర్పీఎం వద్ద 140ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 98శాతం కన్వర్షన్ సామర్థ్యంతో ఉంటాయి. ఈ మోటార్ అత్యద్భుత స్విఫ్ట్ యాక్సెలరేషన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎకో స్కూటర్లో 38 యాంపియర్ల అధిక సామర్థ్యం కలిగిన కంట్రోలర్ ఉంటుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ ను అందిస్తుంది. రిమూవబుల్ బ్యాటరీలు ఉంటాయి. సర్క్యూట్రీ ద్వారా ఓవర్ చార్జింగ్ ను అరికడుతుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. దీనిలో ఎల్ఈడీ హెడ్ లైట్ ఉంటుంది. ఇది ప్రకాశవంతమైన కాంతితో పాటు వైడ్ యాంగిల్స్ లో ప్రొజెక్ట్ అవుతుంది.
స్కూటర్ కు ముందు వైపు డిస్క్ బ్రేక్ సిస్టమ్, ఎల్ఈడీ ఇండికేటర్, టీఎఫ్టీ స్క్రీన్ ఆన్ బోర్డ్ నావిగేషన్ అందిస్తుంది. అలాగే ఆన్ రోడ్ కాలింగ్ కు మద్దతు నిస్తుంది. బ్లూటూత్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్, సెల్ఫ్ డయాగ్నోసిస్/ఆటో రిపేర్ ఫీచర్ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..