Two Wheeler Sales: టూ వీలర్స్ అమ్మకాల్లో నయా రికార్డు.. అక్టోబర్‌లో ఏకంగా 21.64 లక్షల యూనిట్ల అమ్మకం

|

Nov 14, 2024 | 2:01 PM

భారతదేశంలో టూ వీలర్ల వినియోగం భారీగా పెరుగుతుంది. ప్రజా రవాణాలో అసౌకర్యాల కారణంగా చాలా టూ వీలర్స్‌ కొనుగోలు చేసుకుని తమ రోజువారీ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో అన్ని కంపెనీలు సామాన్యులకు అనువుగా ఉండే టూ వీలర్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. అయితే తాజాగా పండుగల నేపథ్యంలో టూవీలర్స్ అమ్మకాలు నయా రికార్డును నెలకొల్పాయి. ఆ వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

Two Wheeler Sales: టూ వీలర్స్ అమ్మకాల్లో నయా రికార్డు.. అక్టోబర్‌లో ఏకంగా 21.64 లక్షల యూనిట్ల అమ్మకం
Bike Riding
Follow us on

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2023 అక్టోబర్‌లో 18.96 లక్షల యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో 14.2 శాతం పెరిగి 21.64 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. కార్లు, ఎస్‌యూవీలతో సహా ప్యాసింజర్ వాహన విక్రయాలు కూడా అక్టోబర్‌లో వారి అత్యధిక నెలవారీ స్థాయి 3.93 లక్షల యూనిట్లకు పెరిగాయి. అంటే బేస్ ఫిగర్ కంటే 0.9 శాతం పెరుగుదల నమోదైంది.  అక్టోబర్ 2024లో రెండు ప్రధాన పండుగలు దసరా, దీపావళి రెండూ ఒకే నెలలో రావడంతో ఈ స్థాయి అమ్మకాలు సాధ్యమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొత్త వాహనాలపై వినియోగదారులను ఆకర్షించేలా వివిధ కంపెనీలు ఇచ్చిన ఆఫర్ల వల్ల కూడా కొనుగోళ్లు పెరిగాయని పేర్కొంటున్నారు.  ప్యాసింజర్ వాహనాలు 2024 అక్టోబర్‌లో అత్యధికంగా 3.93 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. 

వాహన వాహన రిజిస్ట్రేషన్ డేటాలో కూడా ఈ వృద్ధి నమోదైంది. అక్టోబర్ 2023తో పోల్చితే 2024 అక్టోబర్‌లో ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌లో 30 శాతం కంటే ఎక్కువ వృద్ధి కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. అయితే గత అక్టోబర్‌తో పోలిస్తే త్రీ-వీలర్‌లు అంతకుముందు సంవత్సరం అక్టోబర్‌తో పోలిస్తే 0.7 శాతం తగ్గాయి. అక్టోబర్ 2024లో 0.77 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అయితే గత అక్టోబర్‌తో పోలిస్తే రిజిస్ట్రేషన్‌లో 11 శాతం వృద్ధి కనిపించిందని పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం సాధారణ రుతుపవనాల కారణంగా మెరుగైన పంట దిగుబడి వల్ల వ్యవసాయ రంగంలో అధిక ఆదాయాలు లభించినందున ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరగాయని అంచనా వేస్తున్నారు. 

అలాగే ప్రభుత్వం వివిధ పంటల కనీస మద్దతు ధరను పెంచడం కూడా రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడిందని నిపుణులు చెబుతున్నారు.  భారతదేశానికి సంబంధించిన ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెక్టార్‌లో కూడా ఇది స్పష్టంగా కనిపించిందని వివరిస్తున్నారు. ఇటీవల వెల్లడైన ఓ సర్వే ప్రకారం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ వస్తువుల అమ్మకాలు విలువ ప్రకారం 5.7 శాతం, వాల్యూమ్‌ పరంగా 4.1 శాతం పెరిగాయి. గ్రామీణ డిమాండ్‌ కారణంగా వరుసగా మూడో త్రైమాసికంలో పట్టణ మార్కెట్‌ల కంటే వేగంగా వృద్ధి చెందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..