
భారతదేశంలో ప్రముఖ ఈవీ తయారీ కంపెనీ అయిన ఏథర్ ఎనర్జీ తన రిజ్టా జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కొత్త అప్‌డేట్‌ను పరిచయం చేసింది. ఈ ఈ వీ స్కూటర్ డ్యాష్‌బోర్డ్‌లో ఎనిమిది ప్రాంతీయ భాషలకు మద్దతు ఇచ్చేలా సూపర్ అప్‌డేట్‌తో మన ముందుకు వచ్చింది. హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఇప్పుడు సేవలను పొందవచ్చు. ఈ ఫీచర్ వల్ల ఇంగ్లిష్ అర్థం కాని వారికి రిజ్టా స్కూటర్ వాడడం సౌకర్యంగా ఉంటుంది. ఈ అప్‌డేట్‌లో మొదట హిందీ భాష ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. తదుపరి మిగిలిన భాషలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ముఖ్యంగా ఈ మల్టీ లాంగ్వేజ్ స్టాక్ రిజ్టా జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కోసం ఇప్పటికే ఉన్న ఏథర్ స్టాక్ ఓటీఏ(ఓవర్-ది-ఎయిర్) అప్‌డేట్‌తో అందుబాటులో ఉంటుంది. రిజ్టా జెడ్ గురించి ఏథర్‌కు సంబంధించిన టాప్-స్పెక్ ఫ్యామిలీ-ఓరియెంటెడ్ స్కూటర్, రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ల ధర రూ. 1,26,499, అలాగే మరో స్కూటర్ రూ. 1,46,499 (రెండూ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది.
ఏథర్ రిజ్టా జెడ్ చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 123 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అయితే 3.7 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 159 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిమీకి పరిమితం చేస్తున్నారు. అలాగే ఎల్ఈడీ లైట్లు, టీఎఫ్‌టీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, ఫాల్ సేఫ్ అలర్ట్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఒకవేళ మీరు ప్రో ప్యాక్‌ని ఎంచుకుంటే స్కూటర్ స్మార్ట్ ఎకో, జిప్, ట్రాక్షన్ కంట్రోల్, మొబైల్ ఛార్జింగ్, ఆటో హోల్డ్, రివర్స్ మోడ్ వంటి అదనపు ఫీచర్లతో వస్తుంది. కానీ ప్రో ప్యాక్ మీరు దాదాపు రూ. 20,000 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి