Share Market: ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో రాబడి వరద.. టాప్-5 స్టాక్స్ ఇవే..!
భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానాలు మారాయి. స్థిర ఆదాయాన్ని ఇచ్చే పథకాల్లో కాకుండా రిస్క్ ఎక్కువైనా పర్లేదు తక్కువ సమయంలో ఎక్కువ రాబడినిచ్చే షేర్ మార్కెట్స్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో తమ పెట్టుబడిపై అధిక రాబడినిచ్చిన టాప్-5 స్టాక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల జోష్ కనిపిస్తోంది. దీంతో కంపెనీ షేర్ ధరలు వాటి గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా పడిపోయాయి. ఈ స్థితిలో ప్రాథమికంగా బలమైన షేర్లపై పెట్టుబడి పెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడిదారులు పీఈజీ నిష్పత్తి (ధర/సంపాదన నుంచి వృద్ధి నిష్పత్తి) ఆధారంగా పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. పీఈజీ అనేది ముఖ్యమైన స్టాక్ వాల్యుయేషన్. ఇది స్టాక్‌కు సంబంధించిన సరైన ధరను కనుగొనడంలో సహాయపడుతుంది. ఈ నిష్పత్తిని కంపెనీ పీ/ఈ నిష్పత్తిని దాని అంచనా వేసిన ఆదాయ వృద్ధి రేటుతో భాగించడం ద్వారా లెక్కిస్తుంది. ఒక స్టాక్‌కు సంబంధించిన పీఈజీ నిష్పత్తి 1 కంటే తక్కువగా , ఆ స్టాక్ విలువ తక్కువగా ఉండవచ్చని, మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని సూచిస్తుంది.
జూపిటర్ వ్యాగన్లు
జూపిటర్ వ్యాగన్స్ భారతీయ రైల్వేలు, ప్రైవేట్ కంపెనీలకు రైల్వే వ్యాగన్లు, హై-స్పీడ్ బ్రేక్ సిస్టమ్‌లు, ఇతర కీలకమైన పరికరాలను తయారు చేస్తుంది. ఈ కంపెనీ భారతీయ రైల్వేలతో కలిసి పెద్ద ప్రాజెక్టులపై పనిచేస్తోంది. ఈ కంపెనీ పీఈజీ నిష్పత్తి: 0.84గా ఉంది. ప్రస్తుత స్టాక్ ధర ఒక్కో షేరుకు రూ.316గా ఉంది. 52 వారాల గరిష్టాన్ని అంచనా వేస్తే ఒక్కో షేరుకు రూ.748, 52 వారాల గరిష్ట స్థాయి నుంచి క్షీణత లెక్కిస్తే 57.75 శాతంగా ఉంది. రైల్వే రంగంలో పెరుగుతున్న డిమాండ్, ప్రభుత్వం రైల్వేల ఆధునీకరణపై దృష్టి సారించడం వల్ల ఈ కంపెనీ భవిష్యత్తులో మెరుగైన పనితీరును కనబరుస్తుంది.
కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్
కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ భారతదేశంలోని ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ. ఇది రోడ్లు, హైవేలు, నీటిపారుదల, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులలో పనిచేస్తుంది. ఈ కంపెనీకి ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ & కన్‌స్ట్రక్షన్) రంగంలో బలమైన పట్టు ఉంది. ఈ కంపెనీ నిష్పత్తి 0.04గా ఉంది. ఈ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర షేరుకు రూ. 224గా ఉంది. 52 వారాల గరిష్టం రూ.415గా ఉంటే, 52 వారాల గరిష్ట స్థాయి నుంచి క్షీణత 46.02 శాతంగా ఉంది. భారతదేశంలో ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపడుతున్న పెట్టుబడి ప్రణాళికల నుంచి ఈ స్టాక్ ప్రయోజనం పొందవచ్చు.
ఏంజెల్ వన్
ఏంజెల్ వన్ భారతదేశంలో స్టాక్, కమోడిటీ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సేవలను అందించే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ. ఈ కంపెనీ పీఈజీ నిష్పత్తి 0.79గా ఉంది. ఈ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర ఒక్కో షేరుకు రూ. 2,100గా ఉంది. అయితే 52 వారాల గరిష్టం రూ.3,503, 52 వారాల గరిష్ట స్థాయి నుంచి క్షీణత 40.05 శాతంగా ఉంది. భారతదేశంలో పెరుగుతున్న రిటైల్ పెట్టుబడులు, డిజిటల్ బ్రోకరేజ్ సేవల వినియోగం పెరుగుతున్నందున, ఈ స్టాక్ దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు.
కెనరా బ్యాంకు
కెనరా బ్యాంక్ భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, ఎంఎస్ఎంఈ రుణాలు, వ్యవసాయ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఈ బ్యాంకు స్టాక్స్ పీఈజీ నిష్పత్తి 0.01గా ఉంది. ఈ బ్యాంకు ప్రస్తుత స్టాక్ ధర షేరుకు రూ. 85గా ఉంది. అలాగే 52 వారాల గరిష్టంగా రూ.129గా ఉంటే 52 వారాల గరిష్ట స్థాయి నుండి క్షీణత 34.10 శాతంగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇటీవల వివిధ ప్రభుత్వ పథకాల నుంచి మద్దతు పొందుతున్నాయి. తద్వారా వాటి ఆస్తి నాణ్యత మరియు రుణ పంపిణీ మెరుగుపడుతుంది. ఈ స్టాక్ కూడా దీని నుంచి ప్రయోజనం పొందవచ్చు.
యాక్షన్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ (ఏసీఈ)
ఏసీఈ భారతదేశంలోని ప్రముఖ మెటీరియల్ హ్యాండ్లింగ్, నిర్మాణ పరికరాల తయారీదారు, క్రేన్లు, బ్యాక్‌హో లోడర్లు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, వ్యవసాయ పరికరాల తయారీలో అగ్రగామిగా ఉంటుంది. ఈ కంపెనీ పీఈజీ నిష్పత్తి 0.84గా ఉంటుంది. ప్రస్తుత స్టాక్ ధర ఒక్కో షేరుకు రూ.1,136గా ఉంది. 52 వారాల గరిష్టం ఒక్కో షేరుకు రూ.1,695గా ఉంటే, 52 వారాల గరిష్ట స్థాయి నుంచి క్షీణత 32.97 శాతంగా ఉంది. భారతదేశంలో పెరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలు, పారిశ్రామిక అభివృద్ధి కారణంగా ఈ కంపెనీ వృద్ధి అవకాశాలు చాలా బాగున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..