Union Budget 2021: మూడో రోజు కొనసాగనున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. రైతుల ఆందోళనపై చర్చ జరపాలని డిమాండ్‌

|

Feb 02, 2021 | 8:29 AM

Union Budget 2021: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. గత నెల 29న ప్రారంభమైన ఈ సమావేశాలు మంగళవారం మూడు రోజు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు ..

Union Budget 2021: మూడో రోజు కొనసాగనున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. రైతుల ఆందోళనపై చర్చ జరపాలని డిమాండ్‌
Follow us on

Union Budget 2021: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. గత నెల 29న ప్రారంభమైన ఈ సమావేశాలు మంగళవారం మూడు రోజు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు రాజ్యసభ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం సాగనుంది. కాగా, ఒక వైపు పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగుతుండగా, మరో వైపు ఢిల్లీ సరిహద్దు ప్రాంతం రైతుల ఆందోళనతో అట్టుడుకుతోంది. రైతుల ఆందోళనపై రాజ్యసభలో చర్చ జరపాలని ప్రతిపక్ష డిప్యూటీ నేత ఆనంద్‌ శర్మ,, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝాలు బిజినెస్‌ సస్పెండ్‌ నోటీసులు ఇచ్చారు.

కాగా, కరోనా సంక్షోభంలో చిక్కి కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా కేంద్ర సర్కార్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆత్మనిర్బర్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించేందుకు ఆరు సూత్రాలను ప్రకటించారు. అయితే ఈ బడ్జెట్‌లో ఆర్ధిక వ్యవస్థను తిరిగి పుంజుకునే చేసేలా నిర్మలమ్మ ఎలాంటి ప్రకటనలు చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే పెద్దగా ఈ బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు లేకపోగా.. కొత్తగా కొన్నింటిపై అమలులోకి అగ్రిసెస్ రానుంది. ఇక ముఖ్యంగా ఆరోగ్య రంగంపై కేంద్రం అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

Also Read:

Budget 2021 : మౌలిక సదుపాయాలపై కేంద్ర సర్కార్ దృష్టి.. జాతీయ రహదారులకు మహార్ధశ

ఓ వైపు తగ్గింపు, మరో వైపు వడ్డింపు. కర్రు కాల్చకుండానే వాత. అగ్రిసెస్‌ పేరుతో బడ్జెట్‌లో ఈసారి బాగానే వడ్డించారు