Budget 2021 : మౌలిక సదుపాయాలపై కేంద్ర సర్కార్ దృష్టి.. జాతీయ రహదారులకు మహార్ధశ

రోడ్డు మౌలిక స‌దుపాయాల్లో భాగంగా.. జాతీయ రహదారుల మరమ్మత్తులకు కేంద్ర అధిక కేటాయింపులు.

Budget 2021 : మౌలిక సదుపాయాలపై కేంద్ర సర్కార్ దృష్టి.. జాతీయ రహదారులకు మహార్ధశ
Follow us

|

Updated on: Feb 01, 2021 | 2:09 PM

Budget 2021 on Highways : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌. రోడ్డు మౌలిక స‌దుపాయాల్లో భాగంగా.. త‌మిళ‌నాడులో 3,500 కిలోమీట‌ర్ల మేర‌కు జాతీయ హైవే ప‌నులు చేప‌ట్టనున్నారు. దీని కోసం సుమారు 1.03 ల‌క్ష కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. కేర‌ళ‌లో సుమారు 1,100 కిలోమీట‌ర్ల హైవే ప‌నులు జ‌ర‌గ‌నున్నాయి. దీని కోసం 65వేల కోట్లు కేటాయించారు. ప‌శ్చిమ బెంగాల్‌లోనూ 675 కిలోమీట‌ర్ల మేర హైవే ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. దీని కోసం 75 వేల కోట్లు కేటాయించారు.

కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ‌కు ఈ ఏడాది ల‌క్షా 80 వేల కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయించిన‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు. త‌మిళ‌నాడులో రెండు హైవే కారిడార్లను నిర్మించ‌నున్నారు. ఆ ప‌నులు వ‌చ్చే ఏడాది ప్రారంభంకానున్నట్లు ఆమె చెప్పారు. అస్సాంలోనూ 19,000 కోట్ల హైవే ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

Read Aslo… Union Budget 2021 Income Tax: ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు ప్రస్తావన లేని నిర్మలమ్మ బడ్జెట్

Latest Articles