Tollywood: ఈ చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు అందాల వయ్యారి.. నెట్టింట అమ్మడు అటామ్ బాంబ్..

చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై అటామ్ బాంబ్. చూడచక్కని ముద్దుగుమ్మగా ముస్తాబై.. చిన్నారి పెళ్లి కూతురిగా కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పింది. అందం, అభినయంతో ఆకట్టుకున్నా ఈ వయ్యారికి సౌత్ ఇండస్ట్రీలో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఈ సోగసరి చేతిలో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.

Tollywood: ఈ చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు అందాల వయ్యారి.. నెట్టింట అమ్మడు అటామ్ బాంబ్..
Actress
Follow us

|

Updated on: May 05, 2024 | 9:42 AM

ఇప్పుడు నెటిజన్స్ ఎక్కువగా సెలబ్రెటీస్ త్రోబ్యాక్ ఫోటోస్ పై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెండితెరపై స్టార్ నటీనటులుగా కొనసాగుతున్న తారలు చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఈ మధ్య తారల చిన్ననాటి ఫోటేస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు మీకోసం ఓ అందాల తార చైల్డ్ హుడ్ ఫోటో తీసుకువచ్చాం. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై అటామ్ బాంబ్. చూడచక్కని ముద్దుగుమ్మగా ముస్తాబై.. చిన్నారి పెళ్లి కూతురిగా కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పింది. అందం, అభినయంతో ఆకట్టుకున్నా ఈ వయ్యారికి సౌత్ ఇండస్ట్రీలో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఈ సోగసరి చేతిలో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?. తను మరెవరో కాదండి.. హీరోయిన్ నిధి అగర్వాల్.

చూడగానే చిన్నారి పెళ్లి కూతురిగా కట్టిపడేస్తున్న ఈ చిన్నారి హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో నర్తకిగా కనిపించనున్నట్లు సమాచారం. మోడలింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమున్న నిధి.. 2014లో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత హిందీలో మున్నా మైఖేల్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిధికి అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన మజ్ను సినిమాలో మెరిసింది. ఈ మూవీ కూడా నిధికి నిరాశే మిగిల్చింది. కానీ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిధికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్ హీరో శింబు జోడిగా ఈశ్వరన్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో ఒకే సినిమాలో కనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో
IRCTC టూర్.. 15వేలకే తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను చుట్టేయ్యండి
IRCTC టూర్.. 15వేలకే తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను చుట్టేయ్యండి