AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: సామాన్యునికి రైలు ప్రయాణంలో సంతోషం దొరికేలా చేయండి మేడమ్!

బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మలాసీతారామన్‌. ఈ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రైలు ప్రయాణికులు కూడా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

Budget 2023: సామాన్యునికి రైలు ప్రయాణంలో సంతోషం దొరికేలా చేయండి మేడమ్!
Budget 2023
Subhash Goud
|

Updated on: Jan 31, 2023 | 3:23 PM

Share

బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మలాసీతారామన్‌. ఈ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రైలు ప్రయాణికులు కూడా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. అయితే బడ్జెట్‌పై సామాన్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

నిర్మలా మేడమ్

నమస్తే.. నా పేరు రాజీవ్

ఇవి కూడా చదవండి

నేను ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం నివాసిని.. నేను తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఒక చిన్న కంపెనీలో పని చేస్తున్నాను. పండగకు మా వూరు వెళ్లాలని.. నేను విశాఖ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీ మెట్ల మీద కూర్చొని నా ప్రయాణం ప్రారంభించాను.స్లీపర్‌లో నా రిజర్వేషన్ కన్ ఫర్మ్ కాలేదు. దాదాపుగా రెండు నెలల ముందే రిజర్వ్ టికెట్స్ అయిపోయి.. వెయిట్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు మా వూరికి కన్ ఫర్మ్ రిజర్వ్ అసలు టికెట్ ఖరీదు 635 రూపాయలు. దీనికోసం ఏజెంట్ రూ.1500 డిమాండ్ చేస్తున్నాడు.

నా దగ్గర అంత డబ్బు లేదు. అందుకే ఇలా కిక్కిరిసిన జనరల్ బోగీలో.. మెట్ల మీద కూచుని నా ప్రయాణం మొదలు పెట్టాను.. అయినా ఏమి ఇబ్బంది లేదు. నేను ఒంటరిగా లేను. ఇలా ప్రయాణం చేసే వాడిలో నెనే మొదటి వాడిని కాదు. దేశంలో మూడు తరాలు గడిచినా సాధారణ రైల్వే ప్రయాణికుల భవితవ్యం మాత్రం మెరుగుపడలేదు

ఇది బడ్జెట్ సీజన్.. ఇంకా నా ప్రయాణం చాలా దూరం సాగుతుంది. ఈమధ్య ఎక్కడో మీరు బడ్జెట్ సలహాలు అడిగారని చదివాను. అందుకే మీకు ఈ ఉత్తరం రాయాలని అనిపించింది. అలా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఈ ఉత్తరం రాయడం మొదలుపెట్టాను. రైలు వేగం.. జనం తోపులాటలు.. రైలు కుదుపుల మధ్య నా ఆలోచనలు కుదిరాయి

నిర్మలా మేడమ్.. నేను గత 15 సంవత్సరాలుగా రైలులో ప్రయాణిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి పండక్కీ రెలులోనే ఊరు వెళతాను. రైల్వేలో ఎన్నో మార్పులు చూశాను. కానీ, ఇన్ని మార్పులు చేసినా ఈ టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ ఎందుకు అంతం కాలేదో అర్థం కావడంలేదు. రైలు బడ్జెట్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. బడ్జెట్ పరిమాణం పెరిగింది. కానీ జనరల్ బోగీలో ప్రయాణించే నాలాంటి ప్రయాణికుడి రోజులు మారలేదు. చాలా స్టేషన్లు, రైళ్లు ఇప్పటికీ అపరిశుభ్రంగానే ఉన్నాయి. టిక్కెట్ల కోసం పెనుగులాట తగ్గేలా కనిపించడం లేదు.

స్టేషన్‌లో లభించే టీ దగ్గర నుంచి ఫుడ్ వరకూ మరింత ఖరీదైనదిగా మారింది. అయితే, రుచి.. శుభ్రత విషయంలో మరింత అధ్వాన్నంగా తయారైంది. రైల్వేకు చెందిన చిన్న చెల్లెలు అంటే లోకల్ ట్రైన్.. అదే EMU పరిస్థితి అయితే అసలు చెప్పాల్సిన పనే లేనంత దారుణంగా ఉంటుంది.

ఖరీదైన రైళ్లలో ప్రయాణించే వారు.. ట్వీట్ చేయడం ద్వారా మిమ్మల్ని అభినందిస్తున్నారు. వారు తింటున్న ఆహారం, పానీయాల ఫోటోలను పోస్ట్ చేసి రైల్వే గొప్పతనం చెబుతున్నారు. ఇది నిజమే కావచ్చు. కానీ, ఇప్పుడు జనరల్ బోగీలో ఏం తిప్పలు పడ్డామో ఇంట్లో కూడా చెప్పలేకపోతున్నాం. ఆర్థిక మంత్రి గారూ.. స్వచ్ఛమైన రైళ్లలో ప్రయాణించడం, సమయానికి చేరుకోవడం ఇలాంటి మంచి సౌకర్యాలకు మేము కూడా అర్హులమే కదా. ఇప్పుడు ప్రత్యేక రైలు బడ్జెట్ అనే కథ ముగిసింది. రైల్వేల గురించి సాధారణ బడ్జెట్ లోనే వినిపిస్తున్నారు. అందుకే మీకు ఈ లెటర్ రాస్తున్నాను. నిర్మలా మేడమ్.. నా కొడుకు యూట్యూబ్‌లో విదేశీ రైలు వీడియో చూశాడు. నాన్న మన రైలు కూడా ఇలాగే ఉంటే బావుంటుంది కదా అని అడిగాడు.. ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. కానీ, ఇప్పుడు వాడికి నేను ఏమి మాధానం చెప్పాలో బడ్జెట్‌లో మీరు చెప్పాలి. నా కొడుకు కలల ట్రైన్ సరైన ట్రాక్‌లో నడుస్తుందని నేను ఆశిస్తున్నాను

మీ

రాజీవ్

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..