లోక్‍సభ బరిలో కన్నడ హీరోయిన్!

బీజేపీ తొలి జాబితాలో బెంగళూరు గ్రామీణ నియోజవకర్గానికి అభ్యర్థి పేరును పెండింగ్‌లో ఉంచారు. నటుడు మాజీమంత్రి సి.పి.యోగేశ్వర్‌ పేరును రాష్ట్ర పార్టీ నేతలు అధిష్ఠానానికి సిఫారసు చేసిన సంగతి విదితమే. అయితే జాతీయ రాజకీయాలలోకి వెళ్ళేందుకు ఆసక్తి చూపడం లేదు. తన బదులు తన కుమార్తె నిషా యోగేశ్వర్‌కు టికెట్‌ ఇవ్వాలని సూచించారు. 29ఏళ్ళ నిషాకు రాజకీయాలు కొత్తేమీ కాదు. చెన్నపట్టణంలో తన తండ్రి సి.పి.యోగేశ్వర్‌ తరపున ఇంటింటికీ వెళ్ళి ఓట్లను అభ్యర్థించి ప్రచారం చేశారు. నిజానికి […]

లోక్‍సభ బరిలో కన్నడ హీరోయిన్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 23, 2019 | 12:25 PM

బీజేపీ తొలి జాబితాలో బెంగళూరు గ్రామీణ నియోజవకర్గానికి అభ్యర్థి పేరును పెండింగ్‌లో ఉంచారు. నటుడు మాజీమంత్రి సి.పి.యోగేశ్వర్‌ పేరును రాష్ట్ర పార్టీ నేతలు అధిష్ఠానానికి సిఫారసు చేసిన సంగతి విదితమే. అయితే జాతీయ రాజకీయాలలోకి వెళ్ళేందుకు ఆసక్తి చూపడం లేదు. తన బదులు తన కుమార్తె నిషా యోగేశ్వర్‌కు టికెట్‌ ఇవ్వాలని సూచించారు. 29ఏళ్ళ నిషాకు రాజకీయాలు కొత్తేమీ కాదు. చెన్నపట్టణంలో తన తండ్రి సి.పి.యోగేశ్వర్‌ తరపున ఇంటింటికీ వెళ్ళి ఓట్లను అభ్యర్థించి ప్రచారం చేశారు. నిజానికి 2018 శాసనసభ ఎన్నికలలోనే చెన్నపట్టణ నుంచి నిషా పేరు తెరపైకి వచ్చింది.

అమెరికాలో ఎం,ఎస్ చదివిన నిషా మోడలింగ్‌లో పేరు ప్రఖ్యాతులు గడించి ఫ్యాషన్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం మోడల్‌ గాను, నటిగానూ బిజీగా ఉంటూ తండ్రికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు చూసుకుంటోంది. ఒకవేళ బెంగళూరు గ్రామీణ నుంచి నిషా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఈ నియోజకవర్గానికి పోటీ చేసిన తొలి మహిళగా అరుదైన ఖ్యాతిని తన సొంతం చేసుకోవడం ఖాయం.