భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్న మహిళ.. వీడియో వైరల్

చిన్న చిన్న పాములను చూస్తే చాలు.. దూరంగా జరిగిపోతారు.  అదే విష సర్పాలను చూస్తే.. భయంతో వణికిపోతూ.. దూరంగా పరుగెడతారు. అదే.. కొండ చిలువను చూస్తే.. ఎక్కడ మింగేస్తుందోనని.. ప్రాణభయంతో దూరంగా పరుగెడతారు. ఎందుకంటే అది ఏ ప్రాణినైనా చుట్టేసి.. ఎముకల్ని విరిచేసి.. చంపేస్తుంది. అయితే అలాంటి ఓ కొండచలువను కేరళకు చెందిన ఓ మహిళ మాత్రం.. సునాయసంగా పట్టుకుని సంచిలో పడేసింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన విద్య అనే మహిళ.. కేరళలోని ఎర్నాకుళం పానంపల్లి […]

భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్న మహిళ.. వీడియో వైరల్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 13, 2019 | 12:22 PM

చిన్న చిన్న పాములను చూస్తే చాలు.. దూరంగా జరిగిపోతారు.  అదే విష సర్పాలను చూస్తే.. భయంతో వణికిపోతూ.. దూరంగా పరుగెడతారు. అదే.. కొండ చిలువను చూస్తే.. ఎక్కడ మింగేస్తుందోనని.. ప్రాణభయంతో దూరంగా పరుగెడతారు. ఎందుకంటే అది ఏ ప్రాణినైనా చుట్టేసి.. ఎముకల్ని విరిచేసి.. చంపేస్తుంది. అయితే అలాంటి ఓ కొండచలువను కేరళకు చెందిన ఓ మహిళ మాత్రం.. సునాయసంగా పట్టుకుని సంచిలో పడేసింది. వివరాల్లోకి వెళితే..

బీహార్‌కు చెందిన విద్య అనే మహిళ.. కేరళలోని ఎర్నాకుళం పానంపల్లి నగర్‌లో నివసిస్తున్నారు. రోజులాగే ఇంటి వెనకవైపు వెళ్లగా.. అక్కడ ఏదో కదులుతున్నట్లు అనిపించడంతో.. దగ్గరకు వెళ్లి చూసింది. అక్కడ కొండచిలువ ఉండి చూసి షాక్‌కు గురయ్యింది. అయితే అందరిలా భయపడకుండా.. కాస్త వెరైటీగా థింక్ చేసింది. కొండచిలువ తనపై దాడిచేయడానికి ముందు.. తానే ఎదురుదాడి చేసి దాన్ని పట్టుకుంటే ఓ పనైపోతుందనుకుందేమో. వెంటనే ఆ కొండచిలువ మెడను పట్టేసుకుంది. అది చూసిన పొరుగింటి వారితో పాటు.. మరికొందరు ఎంటర్ అయ్యారు. మిగతా వారి సహాయంతో దివ్య ఆ కొండచిలువను బంధించి ఓ సంచిలో పడేసింది. అయితే ఈ సంఘటనను మొత్తం అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. అంత పెద్ద కొండచిలువను సులువుగా ఒడిసిపట్టుకున్న విద్యను చూసి నెటిజన్లు షాక్ తింటున్నారు. కాగా, ఆ మహిళకు పాములు పట్టుకునే అలవాటు ఉందని తెలుస్తోంది. అయితే అంత పెద్ద కొండచిలువను సులువుగా.. చేత్తో పట్టుకుని సంచిలో బంధించడంతో అంతా షాక్‌కు గురయ్యారు.