వైసీపీ మీద సుప్రీం కోర్టుకు వెళతా: శివకుమార్

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనదేనని అంటున్నారు ఆ పార్టీ వ్యవస్థాపకులు శివకుమార్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ తిరిగి తనకు వచ్చేదాకా పోరాటం చేస్తానని చెప్పారు. ఎన్నికల సంఘంలో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని, ఫ్యాన్ సింబల్‌ను కూడా ఫ్రీజ్ చేయమని అడుగుతానన్నారు. మళ్లీ వైసీపీ అధ్యక్షుడ్ని అయ్యేంత వరకూ పోరాటం చేస్తానని శివకుమార్ ప్రకటించారు. 2009లో వైఎస్ చనిపోయాక 6 నెలల తర్వాత ఎన్నికల సంఘంలో వైసీపీ రిజిస్ట్రర్ చేయించానని వెల్లడించారు. మంచి రాజకీయ […]

వైసీపీ మీద సుప్రీం కోర్టుకు వెళతా: శివకుమార్
Follow us

|

Updated on: Feb 21, 2019 | 8:36 PM

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనదేనని అంటున్నారు ఆ పార్టీ వ్యవస్థాపకులు శివకుమార్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ తిరిగి తనకు వచ్చేదాకా పోరాటం చేస్తానని చెప్పారు. ఎన్నికల సంఘంలో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని, ఫ్యాన్ సింబల్‌ను కూడా ఫ్రీజ్ చేయమని అడుగుతానన్నారు. మళ్లీ వైసీపీ అధ్యక్షుడ్ని అయ్యేంత వరకూ పోరాటం చేస్తానని శివకుమార్ ప్రకటించారు.

2009లో వైఎస్ చనిపోయాక 6 నెలల తర్వాత ఎన్నికల సంఘంలో వైసీపీ రిజిస్ట్రర్ చేయించానని వెల్లడించారు. మంచి రాజకీయ భవిష్యత్ ఇస్తాను, కలిసి పని చేద్దాం అంటే నమ్మి జగన్‌ను పార్టీ అధ్యక్షుడిగా నియమించినట్లు వివరించారు. కానీ జగన్ మాత్రం మోనార్క్‌లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తన గురించి జగన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆలోచించకుండా పార్టీ వ్యవస్థాపకుడినైన తనను సస్పెండ్ చేశారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అయినా షోకాజ్ నోటీసు ఇవ్వకుండా తనను ఎలా సస్పెండ్ చేస్తారని శివకుమార్ ప్రశ్నించారు.