విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆక‌స్మిక‌ బదిలీ

ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం సీపీ ఆర్‌కే మీనాను ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది.

విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆక‌స్మిక‌  బదిలీ

Edited By:

Updated on: Aug 12, 2020 | 9:09 AM

Vizag Cp RK Meena Transfer : ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం సీపీ ఆర్‌కే మీనాను ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. ఆయన ప్లేసులో మనీష్‌కుమార్‌ సిన్హాను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఆర్‌.కె.మీనాను డీజీపీ ఆఫీసులో‌ రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరోవైపు విజిలెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఇంటెలిజెన్స్ డీజీగా ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. ఆయనే విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వ‌ర్తించాల‌ని సూచించింది. కాగా ఆర్కే మీనా ఆకస్మిక బ‌దిలీపై పోలీసు వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”